AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime : యువ కస్టమర్లకు అమెజాన్ బంపరాఫర్.. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మీద 50 శాతం క్యాష్ బ్యాక్. !

కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే 18- 24 ఏళ్ల మధ్య వయసు గల నవయువకులకు 50 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది..

Amazon Prime : యువ కస్టమర్లకు అమెజాన్ బంపరాఫర్.. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మీద 50 శాతం క్యాష్ బ్యాక్. !
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతీ దానికి టెక్నాలజీని వినియోగిస్తున్నారు ప్రజలు. ఇక ఆన్‌లైన్ షాపింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ప్రతీ చిన్నదానికి ఆన్‌లైన్‌ షాపింగ్‌నే ఆశ్రయిస్తున్నారు.
Venkata Narayana
|

Updated on: Jun 02, 2021 | 7:15 AM

Share

Amazon Prime Subscription Available at 50 Percent Off : ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ యువతను ఆకట్టుకోవడానికి బంపరాఫర్‌తో తాజాగా ముందుకొచ్చింది. కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే 18- 24 ఏళ్ల మధ్య వయసు గల నవయువకులకు 50 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఒక సంవత్సరం, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. దీనిలో భాగంగా ప్రైమ్‌ వీడియో, మ్యూజిక్‌, ఫ్రీ డెలివరీ వంటి అమెజాన్ ప్రైం వినియోగదారులకు లభించే సదుపాయాలు పొందేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఏడాదికి రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల కాలానికి రూ. 329 చెల్లించాలి. ఇక, యూత్‌ ఆఫర్‌ కింద దీన్ని సగం ధరకే పొందాలంటే యువ యూజర్లు.. తమ ఆధార్‌ లేదా పాన్‌ లేదా, ఓటర్‌ ఐడీ లేదా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వాటిల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, సెల్ఫీని కూడా పంపించాలి. వెరిఫికేషన్‌ పూర్తయ్యాక 48 గంటల్లోపు రూ. 500 క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ఖాతాలో జమ అవుతుంది. అదే మూడు నెలల ప్లాన్‌ తీసుకునే వారికి రూ. 165 క్యాష్ బ్యాక్ వస్తుంది. వీటిని రీఛార్జులు, అమెజాన్‌లో ఇతర కొనుగోళ్లకు వాడుకోవచ్చు.

అయితే, ఈ ఆఫర్‌ కేవలం మొబైల్ యాప్, బ్రౌజర్లో యాక్టివేట్ చేసుకున్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. డెస్క్‌టాప్‌ లేదా ఐవోఎస్‌ యాప్‌ వినియోగదారులకు ఈ ఆఫర్‌ లభించదని అమెజాన్ పేర్కొంది.

Read also : Vaccination drive for Drivers : 3వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆటో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌