Vaccination drive for Drivers : 3వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్
గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 2.50 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లకు గురువారం నుంచి వ్యాక్సినేషన్ చేయబోతున్నారు..
Covid Vaccination to Auto Drivers in Hyderabad : కరోనా సమయంలోనూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు ఆటో డ్రైవర్లు. కేసీఆర్ సర్కారుతో ఫ్రంట్ లైన్ వర్కర్ల హోదా పొందిన ఆటో డ్రైవర్లు ఈనెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయించుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 2.50 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లకు గురువారం నుంచి వ్యాక్సినేషన్ చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్లు వ్యాక్సిన్ కోసం తమ పేర్లను సంబంధిత ఆర్టీఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని టోకెన్లు పొందాలని టీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్ట్ ఉన్నతాధికారులు తెలియజేశారని ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్లు తమ పేర్లను ఆర్టీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారని చెప్పారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కరోనా మహమ్మారికి చిక్కకుండా ప్రాణాలు కాపాడుకోవాలని మారయ్య కోరారు.