Private Hospitals License : రూల్స్ బ్రేక్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా.. మరో 6 ఆసుపత్రుల లైసెన్సు రద్దు..!

కోవిడ్‌ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఇవాళ మరో ఆరు ఆసుపత్రుల లైసెన్సుల రద్దు.

Private Hospitals License : రూల్స్ బ్రేక్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా..  మరో 6 ఆసుపత్రుల లైసెన్సు రద్దు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 01, 2021 | 9:14 PM

Private Hospitals License cancelled: కోవిడ్‌ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝుళిపిస్తోంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ వైద్యశాలల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. తాజాగా రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిమ్స్‌ (సికింద్రాబాద్‌) , సన్‌షైన్‌ (గచ్చిబౌలి), సెంచరీ (బంజారాహిల్స్‌), లోటస్‌ ( లక్డీకాపూల్‌ ), మెడిసిన్‌ (ఎల్‌బీనగర్‌), ఇంటెగ్రో (టోలీచౌకి) దవాఖానలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 కోవిడ్‌ ఆసుపత్రుల లైనెన్స్‌లు రద్దయ్యాయి. కాగా, మొత్తంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన 113 ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కొత్తగా 6 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది.

Read Also…  Vaccination drive for Drivers : 3వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆటో డ్రైవర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌