AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin black fungus: మ‌రో టెన్ష‌న్… ‘స్కిన్​ బ్లాక్​ ఫంగస్​’…. దేశంలో ఫ‌స్ట్ కేసు న‌మోదు..

దేశంలో క‌రోనా విజేత‌ల‌ను ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతుంది. తొలుత బ్లాక్, ఆ త‌ర్వాత వైట్, తాజాగా ఎల్లో ఫంగ‌స్ కేసులు దేశంలో న‌మోదైన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్ ఫంగ‌స్...

Skin black fungus: మ‌రో టెన్ష‌న్... 'స్కిన్​ బ్లాక్​ ఫంగస్​'.... దేశంలో ఫ‌స్ట్ కేసు న‌మోదు..
Black Fungus
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2021 | 9:07 AM

Share

దేశంలో క‌రోనా విజేత‌ల‌ను ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతుంది. తొలుత బ్లాక్, ఆ త‌ర్వాత వైట్, తాజాగా ఎల్లో ఫంగ‌స్ కేసులు దేశంలో న‌మోదైన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు దేశంలో భారీగా న‌మోద‌వుతున్నాయి. ఇవ‌న్నీ చాల‌న‌ట్టు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దేశంలో మొదటి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదవ్వడం అల‌జ‌డి రేపింది. చిత్రదుర్గ జిల్లాలో 50 ఏళ్ల రోగిలో స్కిన్ బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని దేశంలో ఇదే ఫ‌స్ట‌ కేసు అని వైద్యుల బృందం తెలిపింది. నెల క్రితం కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని పేర్కొన్నారు. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని డాక్ట‌ర్లు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ ఆప‌రేష‌న్ ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా ఇప్పుడు రెండో దశ చికిత్సకు సిద్ధమవుతున్నారు. బ్లాక్​ ఫంగస్​పై రోజుకో వార్త దేశ ప్రజలను భయపెడుతోంది.

కాగా.. ఈ బ్లాక్​ ఫంగస్​ మెదడుపైనా ప్రభావం చూపిస్తోందని తేలింది. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని మహారాజా యశ్వంత్​రావ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో 15శాతం మంది మెదళ్లలో ఈ బ్లాంక్​ ఫంగస్​ను గుర్తించారు. తలనొప్పి, వాంతులు బ్లాక్ ఫంగ‌స్ యొక్క‌ ప్రాథమిక లక్షణాలు కాగా.. మెదడులో వ్యాధి ముదిరితే రోగి సృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.సైనస్​ ద్వారా ఈ బ్లాక్​ ఫంగస్​ మొదడుకు చేరే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

Also Read: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం

తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం