AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Exams: తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలపై... సీబీఎస్​ఈ బాటలోనే తెలంగాణ‌ ఇంటర్‌ బోర్డు సాగే అవకాశం ఉంది. పరీక్షల రద్దుకు మొగ్గు చూపే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

TS Inter Exams:  తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం
Inter Exams Telangana
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2021 | 6:48 AM

Share

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలపై… సీబీఎస్​ఈ బాటలోనే తెలంగాణ‌ ఇంటర్‌ బోర్డు సాగే అవకాశం ఉంది. పరీక్షల రద్దుకు మొగ్గు చూపే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. నేడు లేదా రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విద్యా శాఖ అధికారుల నుంచి స‌మాచారం అందుతోంది. జులై 15 తర్వాత ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటున్నామని కేంద్రానికి ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయాన్ని తెలిపింది. అయితే గతంలో పది, పదకొండో తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించగానే.. మరుసటి రోజే తెలంగాణ స‌ర్కార్ కూడా టెన్త్, ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో విద్యకు సంబంధిత విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు గతేడాదే సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలు రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ రెండో సంవత్సరం కంప్లీట్ చేశారు. సీబీఎస్ఈ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు

కరోనా వ్యాప్తి తీవ్ర‌త నేప‌థ్యంలో వాయిదా పడిన సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రాల విద్యామంత్రులతో కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జరిపిన సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధుల ఆరోగ్యం, భద్రత ముఖ్యం అని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.గత ఏడాది లాగానే ఎవరైనా విద్యార్ధులు పరీక్షలను రాయాలని కోరుకుంటే కరోనా పరిస్ధితులు కుదుటపడిన తర్వాత వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read: అనవసరంగా రోడ్లపైకి రావొద్దు.. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్ రెడ్డి

లాక్‌డౌన్ ఎఫెక్ట్…భారీగా తగ్గిపోయిన మారుతి సుజుకి కార్ల సేల్స్

Follow Us
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..