కోవిద్ సెకండ్ వేవ్ లో దేశవ్యాప్తంగా 594 మంది డాక్టర్ల మృతి, ఢిల్లీలో అత్యధికం….,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడి
కోవిద్ సెకండ్ వేవ్ లో దేశంలో మొత్తం 594 మంది డాక్టర్లు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
కోవిద్ సెకండ్ వేవ్ లో దేశంలో మొత్తం 594 మంది డాక్టర్లు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణించినవారి వివరాలను ఈ సంస్థ ఓ నివేదికలో ప్రచురించింది. ఢిల్లీలో అత్యధికంగా 108 మంది, బీహార్ లో 98 మంది, యూపీలో 67 మంది మరణించారని పేర్కొంది. ఆరు రాష్ట్రాల్లో 25 నుంచి 50 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ లో 43, ఝార్ఖండ్ లో 39, ఏపీ, తెలంగాణాలలో 32 మంచి చొప్పున మరణించగా తమిళనాడులో 21, మహారాష్ట్రలో 17, మధ్యప్రదేశ్ లో 16 మంది మృతి చెందారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. నిజానికి ఇండియాలో తొలిదశలో డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ లో ప్రయారిటీ ఇచ్చారని ఈ సంస్థ తెలిపింది. వైద్య సిబ్బందిపై దాడులు, హింస పెరగడం పట్ల ఈ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని అరికట్టేందుకు గట్టి చట్టం తేవాలని ఇండియన్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. ఉదాహరణకు మంగళవారం అస్సాంలోని ఓ ఆసుపత్రిలో కోవిద్ రోగి ఒకరు మరణించడంతో ఆ రోగి తాలూకు బంధువులు సంబంధిత డాక్టర్ పై దాడి చేశారని, ఇంకా దేశంలో చాలా చోట్ల ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయని ఈ సంస్థ పేర్కొంది.
ఈ విధమైన హింసాత్మక సంఘటనల మధ్య డాక్టర్లు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని రోగులకు సేవలు అందించాల్సి వస్తోందని, ఇప్పటికైనా వెంటనే ఈ దాడుల నివారణకు పటిష్టమైన చట్టాన్ని తేవాలని విజ్ఞప్తి చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అగ్నిపర్వతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిన లావా.. డ్రోన్‌తో వీడియో చిత్రీకరణ.. అంతలోనే షాకింగ్ ఘటన..
Viral Video: భార్యకు కరోనా పాజిటివ్.. భర్త ఏం చేశాడో మీరే చూడండి