Viral Video: భార్యకు కరోనా పాజిటివ్.. భర్త ఏం చేశాడో మీరే చూడండి
ఓ వ్యక్తి.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తన భార్యను ఐసోలేషన్ సెంటర్‌కు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో...
ఓ వ్యక్తి.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తన భార్యను ఐసోలేషన్ సెంటర్‌కు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ సర్కులేట్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే .. మిజోరాంకు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఐసోలేషన్ సెంటర్‌కు తరలించాల్సి వచ్చింది. అయితే కరోనా అంటువ్యాధి కాబట్టి అప్రమత్తత అవసరం. అజాగ్రత్తగా ఉంటే.. వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో అతడు మెదడుకు పదను పెట్టాడు. క్రేజీ ఐడియాతో రోడ్డుమీదకొచ్చాడు. అతని జీప్‌కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమెను ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి.. ఐసోలేషన్ సెంటర్‌కు తరలించాడు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రిపున్ శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. తెగ ట్రెండ్ అవుతుంది. వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. మీ భార్య చాలా లక్కీ’, ‘ మీ తెలివి అదుర్స్’, అంటూ కొందరు కామెంట్లు పెట్టగా.. ‘మరీ అంత జాగ్రత్త ఎందుకు పీపీఈ కిట్ అందిస్తే.. ఆమెను నార్మల్‌గా తీసుకెళ్లెచ్చు. అలా పబ్లిక్‌గా ఏంటి’.. అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. మిజోరాంలో వైరస్ ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,144 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ఉండగా.. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు.
Husband taking his #Covid_positive WIFE to #quarantine_centre in #Mizoram?#INNOVATIVE METHOD.#AtmanirbharBharat#Jugaad @ANI @PTI_News @DDNewsHindi @ndtvindia @RatnadipC @brajeshlive @TheLallantop pic.twitter.com/8j4YWJlFCL
— Rupin Sharma IPS (@rupin1992) May 31, 2021
Also Read: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. అనాథ పిల్లలకు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం