Doctors die : సామాన్య పౌరుల్నే కాదు, ఎంతో మంది డాక్టర్లని సైతం బలి తీసుకుంటోన్న కరోనా మహమ్మారి
ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు చనిపోయిన వారి జాబితాలో ఉన్నారు
COVID-19 saw 594 doctors die : కరోనా మహమ్మారి సామాన్య పౌరుల్నే కాదు, ఎంతోమంది డాక్టర్లని సైతం బలి తీసుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 594 మంది వైద్యులు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు చనిపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఇక, అత్యధికంగా ఢిల్లీలో 107 మంది, బిహార్‌లో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 67 మంది వైద్యులు కరోనా బారినపడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 45 శాతం మంది వైద్యులు మృతి చెందారు. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్-43, జార్ఖండ్-39 ఆంధ్రప్రదేశ్-32, తెలంగాణ-32, పశ్చిమ బెంగాల్-25, తమిళనాడు-21, ఒడిశా-22 మరణాలు ఉన్నాయి. అత్యల్పంగా పుదుచ్చేరిలో ఒకరు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున డాక్టర్లు కొవిడ్‌తో ప్రాణాలొదిలారు.
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు, హర్యానాలో ముగ్గురు, పంజాబ్‌లో ముగ్గురు, అసోం, కర్ణాటకల్లో 8 మంది చొప్పున, మధ్యప్రదేశ్‌లో 16 మంది, మహారాష్ట్రలో 17 మంది వైద్యులు మృతి చెందినట్టు మెడికల్ అసోసియేషన్ తాజా నివేదికలో పేర్కొంది.
Read also : Amazon Prime : యువ కస్టమర్లకు అమెజాన్ బంపరాఫర్.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మీద 50 శాతం క్యాష్ బ్యాక్. !