AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Great Khali: ది గ్రేట్ ఖలీని ట్రోల్ చేసిన ఫ్యాన్..! మన రెజ్లర్ ఏం చేశాడో తెలుసా..!

గ్రేట్ ఖలీ కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అంతే కాదు ట్విట్టర్‌లో కూడా చాలా మంది ఫ్యాన్స్‌తో చాటింగ్ చేస్తుంటారు.. అయితే ఒక్కసారిగా అతనికి కోపం వచ్చింది. ఎందుకో....

The Great Khali: ది గ్రేట్ ఖలీని ట్రోల్ చేసిన ఫ్యాన్..! మన రెజ్లర్ ఏం చేశాడో తెలుసా..!
Wwe Superstar The Great Kha
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2021 | 4:27 PM

Share

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) లో గ్రేట్ ఖలీ అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన  ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రానా. డబ్ల్యుడబ్ల్యుఇలో జరగక పోవడంతో ఆయన ప్రస్తుతం భారత్‌లోనే ఉంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహాబలులను మట్టికరిపించిన రెజ్లింగ్ సూపర్ స్టార్ ఖలీని మాత్రం కొందరు హద్దులు మీరిన ఆకతాయిలు ఆటపట్టిస్తున్నారు. తమకు ఆయనే స్ఫూర్తి అని చెబుతుంటారు దేశంలోని ప్రొఫెషనల్ రెజ్లర్లు. WWEకి వెళ్లిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన గ్రేట్ ఖలీ, మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తున్నారు. రెజ్లింగ్ నుంచి రిటైర్ అయిన తరువాత.. క్రమం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ ఇండియన్ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతున్నాడు.

అభిమానులతో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు పెడుతుంటాడు.. అయితే కొందరు ఆకతాయిలు చేస్తున్న పిచ్చిపనులతో విసిగింగారు. ఫన్నీ రిక్వెస్ట్‌లు పెట్టడమే కాకుండా.. ఖలీపై కామెంట్స్ పెడుతున్నారు. అంతటితో ఆగకుండా మీమ్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అతని ఓపికను పరీక్షిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌తో విసిగిపోయిన ఖలీ ఒక అడుగు వెనక్కి తీసుకున్నాడు.

ఖలీ సోషల్ మీడియాలో తన ఖాతాలోని కామెంట్ బాక్స్‌ను క్లోజ్ చేశాడు. అభిమానుల ట్రోలింగ్ కారణంగా ఖలీ ఈ పనిచేశాడు. ఖలీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా… ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు చాలా కూల్‌గా ఆన్సర్ చేస్తుంటాడు. ఆటలో తీసుకోవల్సిన మెలకువలను వివరిస్తుంటాడు.  అయితే గత కొద్ది రోజులుగా అభిమానులు వింత వ్యాఖ్యలతో ఖాలీని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఈ  ట్వీట్లలో కొన్నింటిని చూడండి.

ప్రస్తుతం WWE కి దూరంగా…

తన గంభీరమైన ఎత్తుకు ప్రసిద్ధి చెందిన ఖలీ WWE లోని ముఖ్యమైన మల్లయోధులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఖలీ ఎత్తు 7 అడుగుల 1 అంగుళం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నందున ఖలీ WWE లో ఆడటం లేదు. ఖలీ చివరిసారిగా రూసోతో అక్టోబర్ 2014 లో ఆడాడు. అప్పటి నుండి ఖలీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. డబ్ల్యుడబ్ల్యుఇతో పాటు ఖలీ ప్రసిద్ధ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా నటించారు. అతను కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు.

ఇవి కూడా చదవండి: Benefits of Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా..! అయితే మీరు చాలా నష్టపోతున్నారు.. అవేంటో తెలుసుకోండి ..!