Sports Minister: నా కుమారుడికి యూకే వీసా వచ్చింది… సాయం చేసిన మంత్రికి ధన్యవాదాలు..
తన కుమారుడికి వీసాలు ఇప్పించిన కేంద్ర క్రీడాశాఖ, విదేశాంగ శాఖలకు సానియా ధన్యవాదాలు చెప్పింది.
తన కుమారుడికి యూకే వీసా మంజూరు చేయడంలో సాయం చేసిన కేంద్ర క్రీడామంత్రి కిరెన్ రిజిజుకు సానియా మీర్జా థ్యాంక్స్ చెప్పింది. ఒలింపిక్స్‌కు ముందు ఇంగ్లాండ్‌లోని పలు టోర్నీల్లో సానియా పాల్గొనాల్సి ఉంది. ఇంగ్లాండ్లో ఇప్పుడు టెన్నిస్ సీజన్ నడుస్తోంది. జూన్ 14 నుంచి బర్మింగ్‌హామ్ ఓపెన్, జూన్ 20 నుంచి ఈస్ట్‌బౌర్న్ ఓపెన్ ఆ తర్వాత జూన్ 28 నుంచి వింబుల్డన్.. టోక్యో ఒలింపిక్స్(Olympics) కంటే ముందు జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనడానికి సానియాకు ఇటీవల వీసా మంజూరైంది. ఆ తర్వాత వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్‌లోనూ సానియా ఆడాల్సి ఉంది.
కానీ భారత్‌లో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతీయుల రాకపోకలపై యూకే ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దీంతో సానియా కుమారుడికి, ఆమె కేర్‌టేకర్‌కు ఇంగ్లండ్ వీసాలు జారీ చేయలేదు. దీంతో సానియా కేంద్ర ప్రభుత్వం జోక్యం కోరింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై క్రీడా మంత్రిత్వ శాఖకు సంప్రదించింది.
కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, విదేశాంగ శాఖలను తన కుమారుడికి వీసా ఇప్పించాలంటూ సానియా అభ్యర్థించింది. ఈ అంశాన్ని ఇంగ్లాండ్ విదేశాంగ శాఖతో చర్చించిన ప్రభుత్వం.. సానియా కుమారుడికి వీసా ఇప్పించింది. ఈ నేపథ్యంలో తన కుమారుడికి వీసాలు ఇప్పించిన కేంద్ర క్రీడాశాఖ, విదేశాంగ శాఖలకు సానియా ధన్యవాదాలు చెప్పింది.
Thank you Sir .. truly appreciate it https://t.co/9p95IrO8Ff
— Sania Mirza (@MirzaSania) June 3, 2021
మంత్రి కిరణ్ రిజిజూ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. సానియా సాధించిన ఘనతల పట్ల దేశం గర్వంగా ఫీలవుతోందనని అన్నారు. భారత్‌కు ఎంతో కీర్తిని తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్‌కు ప్రిపేరవుతున్న నీకు విషెస్ చెబుతున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.
India is proud of your achievements and many laurels you’ve brought for India. @MirzaSania as you prepare to represent India once again in the coming Olympics #Tokyo2020 , our wishes are with you & entire Indian Olympic contingent?? https://t.co/SBInUP5KKB
— Kiren Rijiju (@KirenRijiju) June 3, 2021