Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia 3rd T20: ఫైనల్‌ ఫైట్‌కు వేళాయే.. నేడే హైదరాబాద్‌ వేదికగా భారత్‌- ఆసీస్‌ టీ20 మ్యాచ్.. సర్వం సిద్ధం..

భారత్ - ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఫైట్ ఫైనల్‌కు చేరింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం భారత్‌ - ఆసీస్‌ తలపడనున్నాయి.

India vs Australia 3rd T20: ఫైనల్‌ ఫైట్‌కు వేళాయే.. నేడే హైదరాబాద్‌ వేదికగా భారత్‌- ఆసీస్‌ టీ20 మ్యాచ్.. సర్వం సిద్ధం..
India Vs Australia
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 25, 2022 | 5:10 AM

India vs Australia 3rd T20: భారత్ – ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఫైట్ ఫైనల్‌కు చేరింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం భారత్‌ – ఆసీస్‌ తలపడనున్నాయి. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో ఆసిస్‌ గెలుపొందగా.. రెండో టీ20లో భారత్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవాలని ఇటు రోహిత్ సేన, అటు ఫించ్ సేనలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌లో టీ20 ఫీవర్ జోరుగా వ్యాపించింది. ఆదివారం రాత్రి 7గంటల 30నిమిషాలకు జరిగే మ్యాచ్‌ కోసం.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో పరుగుల వరద పారనుంది. కాగా, మ్యాచ్‌ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా, ఆసీస్‌ జట్లు ఈ రోజు ఉదయం 7గంటలకు ఉప్పల్‌ స్టేడియంకు చేరుకుని సాధన చేయనున్నాయి. సాధన ముగించుకున్న అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్లి విశాంత్రి తీసుకోనున్నారు. అనంతరం సాయంత్రం 5గంటలకు ప్రత్యేక బస్సుల్లో ఇరు జట్లు స్టేడియానికి చేరుకోనున్నాయి.

కాగా.. హైదరాబాద్‌ వేదికగా జరగనున్న భారత్, ఆసీస్‌ మ్యాచ్‌ కోసం.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 300 సీసీ కెమెరాలతో, 2,500ల మంది పోలీస్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమోరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేడియం వద్ద ఫైర్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను మోహరించారు. అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

మూడేళ్ల తరువాత నగరంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో అభిమానులు ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేసి వేచిచూస్తున్నారు. సాయంత్రం 4గంటల తరువాత టికెట్‌ ఉన్నవారిని క్షుణ్నంగా తనిఖీ చేసి స్టేడియం లోపలికి అనుమతించనున్నారు. ఫోన్ మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..