Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఇది కదా కావాల్సింది.. ఐపీఎల్ లెజెండ్రీ లిస్ట్‌లో ఎంట్రీ.. ఏకైక ప్లేయర్‌గా తలా రికార్డ్..

MS Dhoni Creates History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెన్నై సారథి ఎంఎస్ ధోని అద్బుతమైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తొలి ఆటగాడిగా ఎంఎస్ ధోని నిలిచాడు. ఐపీఎల్ లెజెండ్రీల లిస్ట్‌లో చేరిన ఏకైక ఆటగాడిగా ఎంఎస్ ధోని నిలిచాడు.

MS Dhoni: ఇది కదా కావాల్సింది.. ఐపీఎల్ లెజెండ్రీ లిస్ట్‌లో ఎంట్రీ.. ఏకైక ప్లేయర్‌గా తలా రికార్డ్..
Dhoni Ipl Csk
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2025 | 6:33 AM

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో 200 మందిని అవుట్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) మ్యాచ్ 30లో ఈ ఘనత సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని ఈ అరురైన లిస్ట్‌లో చేరాడు. లక్నోకి చెందిన ఆయుష్ బడోని 14వ ఓవర్‌లో రవింద్ర జడేజా బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ధోని తెలివిగా 200వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చారిత్రాత్మక రికార్డు సృష్టించిన ధోనీ..

ధోని ఈ లీగ్ చరిత్రలో 200 మందిని అవుట్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ లెజెండ్‌లో అతని పేరు సువర్ణాక్షరాలతో నమోదైంది. చెన్నై కెప్టెన్ 3 వికెట్లను పడగొట్టాడు. స్టంప్స్ వెనుకాల తన అద్భుతమైన స్కిల్స్‌తో బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.

రిషబ్ పంత్ క్యాచ్ తీసుకోవడం ద్వారా లక్నో కెప్టెన్‌ను 63 (49) వద్ద అవుట్ చేశాడు. అంతకుముందు బదోనిని స్టంప్ చేశాడు. ఆ తర్వాత మథీష పతిరానా విసిరిని లెగ్ సైడ్‌లో వైడ్ బాల్‌తో నాన్-స్ట్రైకర్‌ అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేశాడు. ధోని ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇప్పుడు 270 ఇన్నింగ్స్‌లలో 201 ఐపీఎల్ వికెట్లను సాధించాడు. ఇందులో 46 స్టంపింగ్‌లు, 155 క్యాచ్‌లు ఉన్నాయి.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన కీపర్లు..

201* – ఎంఎస్ ధోని

182 – దినేష్ కార్తీక్

126 – ఎబి డివిలియర్స్

124 – రాబిన్ ఉతప్ప

118 – వృద్ధిమాన్ సాహా

116 – విరాట్ కోహ్లీ

కెప్టెన్ రిషబ్ పంత్ చివరకు తన ఫామ్‌ను తిరిగి పొందడం విశేషం. పంత్ 63 (49) పరుగులతో లక్నో తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు నమోదు చేసింది. అబ్దుల్ సమద్ (11 బంతుల్లో 20), ఆయుష్ బదోని (17 బంతుల్లో 22), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 30) అందరూ అతనికి బలమైన మద్దతు ఇచ్చారు. చెన్నై తరపున అన్షుల్ కాంబోజ్ (1/20, 3 ఓవర్లు), నూర్ అహ్మద్ (0/13) పొదుపుగా బౌలింగ్ చేయగా, రవీంద్ర జడేజా (2/24, 3 ఓవర్లు), మథీష పతిరానా (2/45) వికెట్లు పడగొట్టారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరోగ్య బీమాతో ప్రయోజనాలెన్నో.. చిన్న టిప్స్‌తో ప్రీమియం తగ్గింపు
ఆరోగ్య బీమాతో ప్రయోజనాలెన్నో.. చిన్న టిప్స్‌తో ప్రీమియం తగ్గింపు
KKR vs GT: ఏంది, కోల్‌కతా ఓడింది ఈ కారణంతోనేనా..
KKR vs GT: ఏంది, కోల్‌కతా ఓడింది ఈ కారణంతోనేనా..
ఈపీఎఫ్ఓలో ఆ నిబంధనల మార్పు.. ఇక సొమ్ము విత్‌డ్రా మరింత ఈజీ
ఈపీఎఫ్ఓలో ఆ నిబంధనల మార్పు.. ఇక సొమ్ము విత్‌డ్రా మరింత ఈజీ
నిరుద్యోగులకు తీపికబురు.. APPSC 18 నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్
నిరుద్యోగులకు తీపికబురు.. APPSC 18 నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్
KKR vs GT: 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రికార్డ్..
KKR vs GT: 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రికార్డ్..
అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఎందుకు కొంటారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఎందుకు కొంటారో తెలుసా..
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2025 హాల్‌టికెట్లు విడుదల..డైరెక్ట్ లింక్
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2025 హాల్‌టికెట్లు విడుదల..డైరెక్ట్ లింక్
మరికాసేపట్లో ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు విడుద.. డైరెక్ట్ లింక్ ఇదే
మరికాసేపట్లో ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు విడుద.. డైరెక్ట్ లింక్ ఇదే
రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా
రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా
CSK టీమ్‌లో విషాదం.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ తండ్రి హఠాన్మరణం
CSK టీమ్‌లో విషాదం.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ తండ్రి హఠాన్మరణం