- Telugu News Photo Gallery Sports photos Slow Over Rate Fines: IPL Captains Sanju Samson, Axar Patel Penalized
IPL 2025: ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏ కెప్టెన్‌కు ఎంత ఫైన్ పడిందో తెలుసా? టాప్‌లో ఆ టీమే..!
IPL 2025లో ఇప్పటి వరకు ఆరుగురు కెప్టెన్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాకు గురయ్యారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్లు రియాన్ పరాగ్, సంజు శాంసన్, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో కెప్టెన్ రిషభ్ పంత్, మరియు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ జరిమానాలను ఎదుర్కొన్నారు.
SN Pasha |
Updated on: Apr 14, 2025 | 8:34 PM

ఈ సారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఇద్దరూ స్లో ఓవర్ రేటు కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. అలాగే 5 టీమ్స్ నుంచి మొత్తం ఆరుగురు కెప్టెన్లపై జరిమానా విధించారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

అక్షర్ పటేల్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయలేదు. అందువల్ల, వారికి నెలకు రూ. 12 లక్షల జరిమానా విధించారు.

హార్దిక్ పాండ్యా: మార్చి 30న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా స్లో ఓవర్ వేసినందుకు జరిమానా పడింది.

రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్‌ను 3 మ్యాచ్‌ల్లో నడిపించిన రియాన్ పరాగ్‌కు కూడా జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ తప్పు చేసినందుకు పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

రిషభ్ పంత్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు కూడా జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు.

రజత్ పాటిదార్: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయలేదు. అందువల్ల ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ రూ.12 లక్షల జరిమానా విధించారు.

సంజు శాంసన్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ కూడా నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయలేదు. అందువలన, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్ కంటే ముందు పరాగ్ కెప్టెన్సీలో ఆర్‌ఆర్ ఒకసారి స్లో ఓవర్ రేట్ నమోదుచేయడంతో.. రెండో సారి చేసిన తప్పుకు డబుల్ జరిమానా విధించారు.





























