క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు.. కట్ చేస్తే.. 8 ఫోర్లు, 6 సిక్సులతో తుఫాన్ సెంచరీ.. బంగ్లాకు భారీ షాక్ ఇచ్చిన బ్యాటర్..

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సికందర్ రజా అజేయ సెంచరీ‌తోపాటు ఇన్నోసెంట్ కయా కూడా సెంచరీతో ఆకట్టుకున్నారు.

క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు.. కట్ చేస్తే.. 8 ఫోర్లు, 6 సిక్సులతో తుఫాన్ సెంచరీ.. బంగ్లాకు భారీ షాక్ ఇచ్చిన బ్యాటర్..
Sikandar Raza, Tamim Iqbal, Zimbabwe Cricket
Follow us
Venkata Chari

|

Updated on: Aug 06, 2022 | 3:28 PM

విజయానికి 304 పరుగులు కావాలి. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు పడిపోయాయి. కానీ, ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, తన సత్తా చాటింది. హరారే వేదికగా జరిగిన జింబాబ్వే వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే తరపున అజేయ సెంచరీతో సికందర్ రజా ఆకట్టుకున్నాడు. అతనితో పాటు, ఇన్నోసెంట్ కయా కూడా అద్భుతమైన సెంచరీ సాధించి, సత్తా చాటాడు. ఇద్దరి సెంచరీ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్‌ జట్టు రెండు చేతులు ఎత్తేసింది. హరారేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 303 పరుగులు చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే పడ్డాయి. నలుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ హాఫ్ సెంచరీలు సాధించారు. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 62 పరుగులు చేశాడు. లిట్టన్ దాస్ 81 పరుగులు, ఇనాముల్ హక్ 73, ముష్ఫికర్ రహీమ్ 52 పరుగులు చేశారు. ఫలితంగా జింబాబ్వే ముందు భారీ లక్ష్యం నిలిచింది.

లక్ష్య చేధనలో ఆదిలోనే రెండు వికెట్లు డౌన్..

జింబాబ్వే కెప్టెన్ చకబ్వా 2 పరుగుల వద్ద ఔట్ కాగా, ముసకంద 4 పరుగులు చేశాడు. వెస్లీ మెద్వెరే కూడా 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో జట్టు కష్టాల్లో పడింది అలాంటి సందర్భంలో, సికందర్ రజా ట్రబుల్షూటర్‌గా మారాడు. అతను ఇన్నోసెంట్ కయాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేశాడు. ఇన్నోసెంట్ 66 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సికందర్ రజా 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 112 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం ఇద్దరూ 143 బంతుల్లో 150 పరుగులు జోడించారు. ఇన్నోసెంట్ అద్భుత సెంచరీతో 115 బంతుల్లోనే ఈ స్థానాన్ని సాధించగా.. మరోవైపు సికందర్ రజా కేవలం 81 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని సత్తా చాటాడు.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే స్కోరు 250 దాటడంతో మొసద్దెక్ హొస్సేన్ 110 పరుగుల వద్ద ఇన్నోసెంట్‌ను అవుట్ చేశాడు. కానీ, రజా మాత్రం క్రీజులో కొనసాగాడు. ల్యూక్ జోంగ్వేతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు. జట్టుకు విజయాన్ని అందించిన తర్వాతే రజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే, ఒక పెద్ద ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత సికందర్ రజా ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ ఆటగాడికి గతేడాది బోన్ మ్యారోలో ఇన్ఫెక్షన్ వచ్చింది. సికిందర్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదంలో చిక్కున్నాడు. కానీ, అదృష్టవశాత్తూ త్వరగానే కోలుకున్నాడు. ప్రస్తుతం ఈ ఆటగాడు తన జట్టు కోసం మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడుతూ, ఆకట్టుకుంటున్నాడు.