CWG 2022: గడియారం మిస్టేక్‌ అని చెప్పడం సిల్లీగా ఉంది.. అంపైర్ తీరుతో ఓడిన భారత జట్టు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..

Commonwealth Games 2022: మహిళల హాకీ సెమీ-ఫైనల్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

CWG 2022: గడియారం మిస్టేక్‌ అని చెప్పడం సిల్లీగా ఉంది.. అంపైర్ తీరుతో ఓడిన భారత జట్టు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..
Team India, Hockey, Commonwealth Games 2022
Follow us
Venkata Chari

|

Updated on: Aug 06, 2022 | 3:20 PM

కామన్వెల్త్ గేమ్స్ 2022 ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌పై భారత ఆటగాళ్లతోపాటు అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. అంపైర్ మోసం చేసిందని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ట్విటర్‌లో చీటింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. నిజానికి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పూర్తి సమయం వరకు ఇరు జట్లు సమంగా నిలిచాయి. దీని తర్వాత పెనాల్టీ షూటౌట్‌తో మ్యాచ్‌ని నిర్ణయించాల్సి ఉండగా.. ఇక్కడ భారత జట్టు అధికారిక తప్పిదంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

తొలి పెనాల్టీ షూటౌట్‌ను టీమిండియా కెప్టెన్, గోల్‌కీపర్ సవితా పూనియా కాపాడింది. ఇది జరిగిన వెంటనే షాట్ సమయంలో గడియారం ప్రారంభం కాలేదని రెఫరీ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. తద్వారా ఆస్ట్రేలియాకు మళ్లీ తొలి షాట్ కొట్టే అవకాశం పొందింది. దీంతో మ్యాచ్‌ గమనమే మారిపోయింది. దీని తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. కాగా ఆస్ట్రేలియా మూడు ప్రయత్నాల్లో మూడు గోల్స్ చేసింది. సెమీ ఫైనల్స్ నుంచి టీమిండియా నిష్క్రమించిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ వేదికపై అదికూడా ఓ సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగుతున్నట్లు గుర్తించకపోవడం ఏంటని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడియారం మిస్టేక్‌ అని అంపైర్ చెప్పడం టూమచ్‌గా ఉందని నెట్టింట్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వగ్ తీవ్రంగా స్పందించాడు. ఆట ఏదైనా అంపైర్ మాత్రం తమ సూపర్ పవర్‌తో ఇలాంటి తప్పిదాలు చేస్తుంటారు. క్రికెట్‌లోనూ ఇలాంటివి జరిగేవి. అమ్మాయిలు మీరు బాగా ఆడారు. ఓడిపోయినా పర్లేదు, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే