AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ త్వరగా తగ్గాలంటే ఈ హెర్బల్ డ్రింక్స్ టేస్ట్ చేయాల్సిందే.. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయండిలా..

కొన్ని రకాల హెర్బల్ డ్రింక్స్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రిక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ఒక వారంలోనే మీ శరీరంపై ప్రభావాన్ని చూడటం ప్రారంభిస్తారు.

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ త్వరగా తగ్గాలంటే ఈ హెర్బల్ డ్రింక్స్ టేస్ట్ చేయాల్సిందే.. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయండిలా..
Belly Fat Drinks
Venkata Chari
|

Updated on: Aug 04, 2022 | 1:30 PM

Share

ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్‌తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న కాలంలో పనికే అధిక సమయం కేటాయిస్తూ, వ్యాయామం కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో, కొన్ని రకాల హెర్బల్ డ్రింక్స్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రిక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ఒక వారంలోనే మీ శరీరంపై ప్రభావాన్ని చూడటం ప్రారంభిస్తారు. బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంతో పాటు, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియను పెంచుతాయి. తరచుగా ఆకలి వేయడాన్ని కూడా నియంత్రిస్తాయి. అతిగా తినడం బరువు పెరగడానికి అతిపెద్ద కారణంగా నిలుస్తుంది. కాబట్టి ఈ హెల్దీ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం…

  1. సోంపు వాటర్: సోంపును తీసుకోవడం వల్ల బరువుతోపాటు ఊబకాయం త్వరగా తగ్గుతుంది. దీని కోసం, మెంతులు, జీలకర్ర, క్యారమ్ గింజలను సోంపుతో కలిపి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఉడకబెట్టి, తరువాత వడపోసి తాగాలి. ఫెన్నెల్ సీడ్స్ అజీర్ణం, ఉబ్బరం సమస్యను తొలగిస్తుంది. ముఖ్యంగా ఇది పొట్ట కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. తద్వారా అనవసరమైన ఆహారపు అలవాట్లను నివారించవచ్చు. బరువు తగ్గడంలో ఇది చాలా ముఖ్యమైన విషయం.
  2. తేనె-నిమ్మరసం: ఈ డ్రింక్ తాగాలని పెద్దలు సిఫార్సు చేస్తుంటారు. ఇది బరువు, బొడ్డు కొవ్వును తగ్గించడంంలో కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మకాయలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రెండవది నిమ్మకాయలో పెక్టిన్ అనే డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి.
  3. జీలకర్ర నీరు: బెల్లీ ఫ్యాట్‌ని త్వరగా తగ్గించడంలో జీలకర్ర నీరు కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరమైన డ్రింక్. జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో లేదా తిన్న తర్వాత తాగండి. ఇది శరీరానికి రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి