IND vs AUS: పవర్ ప్లేలో సునామీ ఇన్నింగ్స్.. రోహిత్, రాహుల్‌ల రికార్డును బద్దలు కొట్టిన యంగ్ సెన్సేషన్
తిరువనంతపురం వేదికగా ఆదివారం (నవంబర్ 25) ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 25 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 212 స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. మరింత ధాటిగా ఆడే యత్నంలో నాథన్ ఎల్లిస్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు

తిరువనంతపురం వేదికగా ఆదివారం (నవంబర్ 25) ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 25 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 212 స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. మరింత ధాటిగా ఆడే యత్నంలో నాథన్ ఎల్లిస్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. కాగా తన మెరుపు ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు బద్దలు కొట్టాడు జైస్వాల్. ఈ మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు యశస్వి. తద్వారా ఒక అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2020లో న్యూజిలాండ్‌పై రోహిత్ 50 పరుగులు, 2021లో స్కాట్లాండ్‌పై పవర్ ప్లేలో రాహుల్ 50 పరుగులు సాధించారు. కేవలం 21 సంవత్సరాల వయస్సులో, భారతదేశం తరపున అత్యధిక సంఖ్యలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ప్లేయర్‌గా యశశ్వి నిలిచాడు. ఇప్పటివరకు రెండోసారి ఈ అవార్డును అందుకున్నాడీ యంగ్ సెన్సేషన్. యశస్వి కంటే ముందు, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ మాత్రమే ఈ వయస్సులో ఒక్కసారి మాత్రమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు.
ఇక సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్‌లో 24 పరుగులు పిండుకున్నాడు జైస్వాల్. దీంతో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో జైస్వాల్ సంయుక్తంగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. అంతకుముందు 2017లో శ్రీలంకపై రోహిత్ 24 పరుగులు చేశాడు. ఇక రెండో టీ20లో ఆస్ట్రేలియాను 44 పరుగుల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.
యశస్వి సునామీ ఇన్నింగ్స్ చూశారా?
Yashasvi was in the mood tonight 😌
Scoring a breathtaking half-century in just 24 balls & leaving us in awe! 🤯#INDvAUS #JioCinemaSports pic.twitter.com/gIGNUtmjvO
— JioCinema (@JioCinema) November 26, 2023
30 సెకన్లలో భారత్ వర్సెస్ ఆసీస్ మ్యాచ్ హైలెట్స్..
🇮🇳 We came, we saw, we conquered. 🔥#INDvAUS #IDFCFirstBankT20ITrophy #JioCinemaSports pic.twitter.com/VgDhbb64bI
— JioCinema (@JioCinema) November 26, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




