AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: అప్పుడు అనామక ప్లేయర్‌గా.. ఇప్పుడు కెప్టెన్‌గా.. 11 ఏళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఏం జరిగిందంటే?

ప్రపంచ కప్ 2023లో భాగంగా శనివారం (అక్టోబర్ 14) భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించగా, శ్రీలంక, నెదర్లాండ్‌లపై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు హ్యాట్రిక్‌ విజయంపై  కన్నేశాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs PAK: అప్పుడు అనామక ప్లేయర్‌గా.. ఇప్పుడు కెప్టెన్‌గా.. 11 ఏళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఏం జరిగిందంటే?
Rohit Sharma
Basha Shek
|

Updated on: Oct 13, 2023 | 3:42 PM

Share

ప్రపంచ కప్ 2023లో భాగంగా శనివారం (అక్టోబర్ 14) భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించగా, శ్రీలంక, నెదర్లాండ్‌లపై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు హ్యాట్రిక్‌ విజయంపై  కన్నేశాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా సుమారు 11 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడనుంది. 11 ఏళ్ల క్రితం డిసెంబర్ 28, 2012న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇది టీ20 మ్యాచ్. ఇందులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 36 బంతుల్లో 72 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. అశోక్ దిండా 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. యువరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆడాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జట్టులోని యువకుల్లో రోహిత్ కూడా ఒకడు. అప్పటికి హిట్‌ మ్యాన్‌ అంతర్జాతీయ కెరీర్ కేవలం 5 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌ర్లలో ఒకడైన రోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కేవలం 2 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు.

అప్పటికీ జట్టులో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా రోహిత్ కంటే ముందే బ్యాటింగ్‌కు వచ్చారు. ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా బ్యాటింగ్‌ చేయని రోహిత్‌ ఒక మెరుపు క్యాచ్‌ అందుకుని షాహిద్ అఫ్రిదీని పెవిలియన్‌ పంపించాడు. మొత్తం రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, పాక్‌ జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ హఫీజ్ గెలుచుకున్నాడు. అప్పుడు అనామక ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ నేడు టీమిండియా కెప్టెన్‌గా అదే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో విఫలమైన హిట్‌ మ్యాన్‌ అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. మెరుపు సెంచరీతో టీమిండియాను సులభంగా గెలిపించాడు. ఇప్పుడు పాక్‌పై కూడా అదే తరహా ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..