Shubman Gill: అనారోగ్యంతో బాధపడుతోన్న శుభ్‌మన్ గిల్‌కు శుభవార్త .. స్పెషల్ అవార్డుకు ఎంపిక చేసిన ఐసీసీ
భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను వన్డే ప్రపంచ కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌ని శనివారం పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా గిల్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది. అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. అయితే ఈలోగా శుభ్ మన్‌గిల్‌కి ఓ శుభవార్త వచ్చింది

భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను వన్డే ప్రపంచ కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌ని శనివారం పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా గిల్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది. అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. అయితే ఈలోగా శుభ్ మన్‌గిల్‌కి ఓ శుభవార్త వచ్చింది. ICCలో ఒక ప్రత్యేక అవార్డుతో గిల్‌ను సత్కరించింది. వివరాల్లోకి వెళితే.. ICC ప్రతి నెలా ఒక అత్యుత్తమ ఆటగాడిని ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నెలలో ఆటగాడి ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. అలా సెప్టెంబరు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుగా గిల్ ఎంపికయ్యాడు. అయితే అనారోగ్య సమస్యలతో గిల్ ఈ నెలలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గిల్ త్వరగా కోలుకోవాలని, తద్వారా భారత బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారాలని టీమ్ ఇండియాతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. భావిస్తోంది.
గిల్ సెప్టెంబర్ నెలలో మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 480 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌పై 121 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు. ఆ తర్వాత మొహాలీలో ఆస్ట్రేలియాపై 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్, నేపాల్‌లపై హాఫ్ సెంచరీలు సాధించాడు. గిల్ ప్రదర్శన కారణంగానే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ను భారత్ గెల్చుకుంది. గిల్ ఇదే ఫామ్‌ను ప్రపంచకప్ కూడా కొనసాగిస్తారని అభిమానులు భావించారు. అయితే ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు ముందు అతను డెంగ్యూ బారిన పడ్డాడు. ఈ కారణంగా అతను తొలి మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా ఆడలేదు. ఇప్పుడు పాకిస్థాన్‌పై కూడా ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గిల్ గురువారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. మరి ఇప్పుడు పాకిస్థాన్‌పై మైదానంలోకి దిగేందుకు అతడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ పాకిస్థాన్‌తో ఆడకపోతే 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగవచ్చు.
The young India batter was stellar in September ⭐
More as Shubman Gill claims ICC Player of the Month honours 👇https://t.co/cQKOEsc8Jx
— ICC (@ICC) October 13, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




