World Cup 2023: పాక్, ఆసీస్ కాదు.. రోహిత్ సేనకు ఆ టీంతోనే డేంజర్.. 20 ఏళ్లుగా ఓడిపోతోన్న భారత్.. ఈసారైనా లెక్కలు సరిచేసేనా?
India vs New Zealand: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు 9 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 9 గేమ్‌లలో, భారత్ 3 విజయాలు సాధించగా, న్యూజిలాండ్ 5 సందర్భాలలో విజయం సాధించింది. 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఈ రెండు జట్లు తలపడిన సందర్భంలో భారత్ చేసిన అత్యధిక స్కోరు 252 కాగా, న్యూజిలాండ్ చేసిన అత్యధిక స్కోరు 253. మార్క్యూ ఈవెంట్‌లో న్యూజిలాండ్ అత్యల్ప స్కోర్ 146 కాగా, భారత్ చేసిన అత్యల్ప స్కోర్ 150.
World Cup 2023, India vs New Zealand Stats: వన్డే ప్రపంచకప్ టోర్నీ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. చాలా జట్లు సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబర్ 8న టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తలపడనుంది. అంటే తొలి మ్యాచ్‌లోనే టీం ఇండియాకు గట్టి సవాల్ ఎదురుకానుంది.
ఎందుకంటే, వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు 12 మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా 8 మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. అయితే, 2011లో, 2019 ప్రపంచకప్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించగలిగింది. కాబట్టి, భారత్ విజయం ఆశించవచ్చు.
అయితే మరోవైపు అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడనుంది. ఇక్కడ ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండ్ భారత్‌కు ప్రమాదకరమని చెప్పవచ్చు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై టీమిండియా గెలిచి 20 ఏళ్లు పూర్తయ్యాయి.
- అంటే, చివరిసారిగా 2003లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత, న్యూజిలాండ్ వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో భారత్‌పై విజయం సాధించింది.
- 2007లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, ఆ టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది.
- 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- 2021లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- 2021 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ఇప్పుడు 2023 ప్రపంచకప్‌లో ఇరు జట్లు అక్టోబర్ 22న తలపడనున్నాయి. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా సుదీర్ఘ పరాజయాలకు బ్రేక్ వేస్తుందో లేదో వేచి చూడాలి.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్మీ, విల్ సౌత్ యంగ్.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..