AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: ప్రపంచకప్ ప్రారంభోత్సవం ఆకస్మికంగా రద్దు చేసిన బీసీసీఐ.. ఎందుకంటే?

ICC ODI World Cup 2023 Opening Ceremony Cancelled: BCCI అక్టోబర్ 4 న నిర్వహించ తలపెట్టిన ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. ఆశా భోంస్లే, రణవీర్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్ వంటి స్టార్స్ ప్రారంభ వేడుకకు హాజరవుతారని ఇదివరకే ప్రకటించారు. అయితే, ప్రస్తుతం, ఈ వేడుకలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 10 జట్ల కెప్టెన్లు అక్టోబర్ 3న అహ్మదాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సారథులతో సమావేశం మాత్రమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ICC World Cup 2023: ప్రపంచకప్ ప్రారంభోత్సవం ఆకస్మికంగా రద్దు చేసిన బీసీసీఐ.. ఎందుకంటే?
Icc Odi World Cup 2023
Venkata Chari
|

Updated on: Oct 03, 2023 | 2:42 PM

Share

ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మరో ఆటంకం వచ్చి పడింది. ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై మొదట్లో విమర్శలు, ఆ తర్వాత వేదికలపై గందరగోళం, టిక్కెట్లలో లోపం ఇలా అన్నీ బీసీసీఐ అనుకున్నట్టు జరగడం లేదు. ఇదిలా ఉండగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది.

ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమయ్యే వరకు అక్టోబర్ 4 న ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ఇన్‌సైడ్ స్పోర్ట్ రిపోర్ట్‌ ప్రకారం, ముందుగా BCCI ప్రారంభ వేడుకలను ప్లాన్ చేసింది.

ఇందులో ఆశా భోంస్లే, రణవీర్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్ వంటి స్టార్స్ ప్రారంభ వేడుకకు హాజరవుతారని ప్రకటించారు. అయితే, దైనిక్ జాగరణ్ తాజా నివేదికల ప్రకారం, BCCI ఎటువంటి ప్రారంభ వేడుకలను నిర్వహించదని తెలుస్తోంది.

ఈ నివేదికలు నిజమైతే, బీసీసీఐ 4వ తేదీన అన్ని టీంల సారథులతో సమావేశం మాత్రమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో లేజర్ షో ఉండవచ్చు. ఓపెనింగ్ సెర్మనీకి బదులుగా నవంబర్ 19న ముగింపు వేడుకను నిర్వహించాలని లేదా అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కంటే ముందు ఘనంగా వేడుకను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని అంటున్నారు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

మొత్తం 10 జట్ల కెప్టెన్లు అక్టోబర్ 3న అహ్మదాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సారథులతో సమావేశం మాత్రమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  అయితే, ఈరోజు భారత్-నెదర్లాండ్స్, ఇతర జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ఉన్నందున, రోహిత్ శర్మతో సహా కొంతమంది కెప్టెన్లు అక్టోబర్ 4 ఉదయం అహ్మదాబాద్‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ ఈరోజు (ఏప్రిల్ 3) రెండో, చివరి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత్ జట్టు:

View this post on Instagram

A post shared by ICC (@icc)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..