Video: టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ధోనీ శిష్యుడు.. కట్‌చేస్తే.. భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు.. ఎవరంటే?

Asian Games Men's T20I 2023, IND vs NEP: క్వార్టర్‌ఫైనల్స్‌లో టీమ్ ఇండియా నేరుగా చోటు సంపాదించి, నేడు నేపాల్‌తో తలడింది. ఇక బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియాకు యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ వంటి బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ కావడంతో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 202/4 స్కోరు చేయగా, నేపాల్ జట్టు మొత్తం ఓవర్లు ఆడి 179/9 మాత్రమే చేయగలిగింది.

Video: టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ధోనీ శిష్యుడు.. కట్‌చేస్తే.. భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు.. ఎవరంటే?
Sai Kishore
Follow us
Venkata Chari

|

Updated on: Oct 03, 2023 | 3:14 PM

India vs Nepal, Asian Games Men’s T20I 2023: చైనాలోని గ్వాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ (Asian Games 2023)లో భారత క్రికెట్ జట్టు నేపాల్‌తో తలపడింది. ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ టోర్నమెంట్ తొలి క్వార్టర్ ఫైనల్‌లో భారత్ 23 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 202/4 స్కోరు చేయగా, నేపాల్ జట్టు మొత్తం ఓవర్లు ఆడి 179/9 మాత్రమే చేయగలిగింది.

టీమిండియా తరపున యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. ఈ సమయంలో భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ మ్యాచ్.

ఇందులో సాయి కిషోర్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు భారత జట్టుకు అరంగేట్రం చేశారు. టీమిండియా జెర్సీలో ఇది వారి మొదటి మ్యాచ్. అయితే, ఈ ఆటగాళ్లు చాలా ఎమోషనల్‌గా కనిపించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జట్టు జాతీయ గీతం ఆలపించే సమయంలో సాయి కిషోర్ కన్నీటి పర్వంతమయ్యాడు. టీమిండియాకు ఆడాలనే కలను నెరవేర్చుకున్న తర్వాత భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ ఆటగాడి భావోద్వేగాన్ని ఫీలైన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సాయి కిషోర్..

సాయి కిషోర్ గురించి చెప్పాలంటే, అతను IPLలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడు. అతను తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో చెపాక్ సూపర్ గిల్లీస్‌లో సభ్యుడు. ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఆడే ఆటగాళ్లకు ఆసియా క్రీడల్లో అవకాశం దక్కింది. ఈ ఆటగాళ్లకు ప్రధాన జట్టు నుంచి ఇంకా ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.

క్వార్టర్‌ఫైనల్స్‌లో టీమ్ ఇండియా నేరుగా చోటు సంపాదించి, నేడు నేపాల్‌తో తలడింది. ఇక బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియాకు యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ వంటి బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ కావడంతో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు.

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (c) , యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ , జితేష్ శర్మ ( wk ) , రింకు సింగ్ , శివమ్ దూబే , వాషింగ్టన్ సుందర్ , రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ , రవి బిష్ణోయ్ , అవేష్ ఖాన్ , అర్ష్దీప్ సింగ్.

నేపాల్ జట్టు: కుశాల్ భుర్టెల్ , ఆసిఫ్ షేక్ (wk) , సందీప్ జోరా , గుల్సన్ ఝా , రోహిత్ పౌడెల్ (c) , కుశాల్ మల్లా , దీపేంద్ర సింగ్ ఐరీ , సోంపాల్ కమీ , కరణ్ KC , అబినాష్ బోహారా , సందీప్ లామిచానే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..