IPL 2025: షాకింగ్.. రాజస్థాన్ రాయల్స్ ను వీడనున్న సంజూ శాంసన్! కారణమిదే

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ వైదొలగనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వార్తలు రావడనికి ప్రధాన కారణం ఆర్ ఆర్ టీమ్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియో. కెప్టెన్ గా, ఆటగాడిగా సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్ కు అందించిన సేవలను ఒక వీడియోగా రూపొందించింది ఆర్ ఆర్ టీమ్.

IPL 2025: షాకింగ్.. రాజస్థాన్ రాయల్స్ ను వీడనున్న సంజూ శాంసన్! కారణమిదే
Sanju Samson
Follow us
Basha Shek

|

Updated on: Aug 26, 2024 | 6:24 PM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ వైదొలగనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వార్తలు రావడనికి ప్రధాన కారణం ఆర్ ఆర్ టీమ్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియో. కెప్టెన్ గా, ఆటగాడిగా సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్ కు అందించిన సేవలను ఒక వీడియోగా రూపొందించారు. ఈ వీడియోకి క్యాప్షన్… ‘మేజర్ మిస్సింగ్.’ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే దీనికి ఏడుస్తున్న ఎమోజీని జత చేశారు. ఇప్పుడీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు పలు ప్రశ్నలు, అనుమానాలను లేవదీస్తున్నారు. సంజూ శామ్సన్ ఆర్ ఆర్ టీమ్ ను వీడనున్నాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న శాంసన్‌కు ఐపీఎల్ ట్రోఫీ ఎండమావిగానే మిగిలిపోయింది. ఇక 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శాంసన్ ఒక్కసారి మాత్రమే జట్టును ఫైనల్ చేర్చాడు.

కాగా ఇప్పుడు, ఈసారి IPL వేలానికి ముందు, RR ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ ని నియమించనుందని సమాచారం. దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ వైదొలిగే అవకాశం ఉందనే వార్తలు తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్ లేటెస్ట్ పోస్ట్ ఇదిగో..

మొత్తంగా ఐపీఎల్‌లో 167 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 3 భారీ సెంచరీలతో మొత్తం 4419 పరుగులు చేశాడు. ఇందులో 206 సిక్సర్లు, 352 ఫోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ మెహ వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడితే సంజూ శాంసన్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..