BCCI: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా! బీసీసీఐ కొత్త కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి తనయుడు

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. దీంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇప్పటికే పలు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుత BCCI కార్యదర్శి జైషా నే తదుపరి ICC అధ్యక్షుడిగా ఎంపిక కావడం దాదాపు ఖాయమని వార్తలు వస్తున్నాయి

BCCI: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా! బీసీసీఐ కొత్త కార్యదర్శిగా  కేంద్ర మాజీ మంత్రి తనయుడు
Rohan Jaitley, Jay Shah
Follow us

|

Updated on: Aug 26, 2024 | 7:53 PM

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. దీంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇప్పటికే పలు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుత BCCI కార్యదర్శి జైషా నే తదుపరి ICC అధ్యక్షుడిగా ఎంపిక కావడం దాదాపు ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఐసీసీ అధ్యక్ష పదవికి జే షా దరఖాస్తు చేస్తారా లేదా అన్నది ఆగస్టు 27 నాటికి తేలనుంది. ఒకవేళ జై షా ఐసీసీ అధ్యక్షుడైతే బీసీసీఐ కార్యదర్శి ఎవరనేది పెద్ద ప్రశ్న. వీటన్నింటి మధ్య ఈ విషయానికి సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. నివేదికల ప్రకారం, జై షా ఐసీసీ అధ్యక్షుడైతే, డిడిసిఎ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొత్త కార్యదర్శిగా ఎన్నుకోవచ్చు. రోహన్ జైట్లీ గత కొన్నేళ్లుగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నారు.

రోహన్ జైట్లీ మరెవరో కాదు కేంద్ర మాజీ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు. నివేదిక ప్రకారం, బీసీసీఐ కార్యదర్శి రేసులో రోహన్ ముందున్నట్లు సమాచారం. రోహన్ హయాంలో ఢిల్లీలో 5 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగాయి. అలాగే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభమైంది. ఇందులో భారత క్రికెట్‌లోని పలువురు స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహన్ పేరుపై బీసీసీఐలో అందరూ ఏకీభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో, రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా ఉండగా, ఇతర అధికారులు వారి పదవులలో కొనసాగుతారు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైతే, ఆ పదవికి ఎన్నికైన ఐదో భారతీయుడిగా నిలుస్తారు. జై షా కంటే ముందు జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఆ పదవిని అలంకరించిన వారిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ నిబంధనల ప్రకారం అధ్యక్షుడి ఎన్నికలో 16 మంది డైరెక్టర్లు ఓటు వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చైర్మన్ కావాలంటే 9 ఓట్లు రావాల్సిందే. నివేదికల ప్రకారం, ఐసిసి బోర్డులోని 16 మంది సభ్యులలో 15 మంది జైషాకు మద్దతు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 35 ఏళ్ల వయసులో ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన చైర్మన్‌గా కూడా జైషా నిలిచే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!