IPL 2025: పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసే ఐదుగురు ఆటగాళ్లు వీరే.. బయటికొచ్చిన ఫొటో..
Punjab Kings Leaked Retain Players: IPL 2025కి ముందు మెగా వేలం జరగనుంది. దీనికోసం అటు ఫ్రాంచైజీలతోపాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అన్ని జట్లు ఎంపిక చేసిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయి. రిలీజ్ తర్వాత మెగా వేలంలో ఎవరు పాల్గొంటారు అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు.
Punjab Kings Leaked Retain Players: IPL 2025కి ముందు మెగా వేలం జరగనుంది. దీనికోసం అటు ఫ్రాంచైజీలతోపాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అన్ని జట్లు ఎంపిక చేసిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయి. రిలీజ్ తర్వాత మెగా వేలంలో ఎవరు పాల్గొంటారు అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, ఒక జట్టు మొత్తం ఐదుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ కూడా ఇదే సూచన ఇచ్చింది. పంజాబ్ ఫ్రాంచైజీ గురించి ఒక ప్రత్యేక ఫొటోలను విడుదల చేసినట్లు అభిమానులు సోషల్ మీడియా పోస్టర్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
హిట్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్..
వాస్తవానికి, పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్పెషల్ ఫొటోను ఉంచింది. ఇందులో శామ్ కుర్రాన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, శశాంక్ సింగ్, కగిసో రబాడలతో మొత్తం ఐదుగురిని ఫ్రాంచైజీ కొనసాగించబోతోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీని గురించి ఫ్రాంచైజీ ఇంకా ఏమీ చెప్పలేదు. మెగా వేలానికి ముందు రిటైన్ చేసేది వీరేనంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు.
Punjab Kings Just Leaked The No. of Retentions 😳 Is That Gonna be 5 ? pic.twitter.com/cmUqHNisPy
— 🤍✍ (@imAnthoni_) August 25, 2024
ఐపీఎల్ 2024లో నిరాశ పరిచిన పంజాబ్ కింగ్స్ ప్రదర్శన..
ప్రతి సీజన్‌లాగే, తమ మొదటి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తోన్న పంజాబ్ కింగ్స్ పూర్తి ఉత్సాహంతో ఐపీఎల్ 2024లోకి ప్రవేశించింది. కానీ చివరికి ఆ జట్టు ప్లేఆఫ్‌లకు కూడా చేరుకోలేకపోయింది. మొదటి కొన్ని మ్యాచ్‌ల తర్వాత, రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయపడటంతో, శామ్ కుర్రాన్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అయితే, జట్టు క్రమం తప్పకుండా మ్యాచ్‌లను గెలవలేకపోయింది. దీని కారణంగా టాప్ 4లో చోటు కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో 5 మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..