Team India: టీ20 టీమ్‌లో కోహ్లి-రోహిత్ ఎందుకు లేరు? బీసీసీఐ సెలక్టర్లపై టీమిండియా మాజీ సారథి ఫైర్..
India vs West Indies: టీ20 జట్టుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు. ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు.

India vs West Indies: వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకోవడానికి కారణమేంటి? అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే ఇద్దరు దిగ్గజాలను జట్టు నుంచి తప్పించినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్దిష్ట కారణాలను వెల్లడించలేదు. అందుకే ఇప్పుడు దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశ్నలు సంధించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీ20 జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు. ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. అయితే విదేశీ సిరీస్‌ల నుంచి ఇద్దరు ఆటగాళ్లను తప్పించడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అంటే అతను అద్భుత ఫామ్‌లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోహ్లీని జట్టు నుంచి ఎందుకు తప్పించారని దాదా ప్రశ్నించారు.




విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జట్టులో ఉండాల్సిందని అనుకుంటున్నాను. అయితే సెలక్షన్ కమిటీ వారిని జట్టు నుంచి ఎందుకు తప్పించిందో తనకు తెలియదని గంగూలీ అన్నాడు.
అదే సమయంలో, రింకు సింగ్, జితేష్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడంపై కూడా గంగూలీ మాట్లాడాడు. వారు ఇప్పుడే మంచి ప్రదర్శన చేయడం ప్రారంభించారు. ఇలాగే కొనసాగితే త్వరలోనే జట్టులో అవకాశం రావడం ఖాయమని చెప్పుకొచ్చాడు.
భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, సంజు శాంసన్ ( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
