Arshad Khan: కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్ ఖాన్?
Royal Challengers Bengaluru vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ వికెట్‌ను యంగ్ బౌలర్ అర్షద్ ఖాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీని పెవిలియన్‌కు దారి చూపించిన అర్షద్ ఖాన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Who Is Arshad Khan: అర్షద్ ఖాన్.. చాలా తక్కువ మంది అభిమానులకు తెలిసిన ఈ పేరు.. నేడు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ వికెట్ తీయడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఈ యంగ్ బౌలర్‌ను రూ. 1 కోటి 30 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టీం. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కేవలం 7 పరుగులకే అవుట్ చేసి, బెంగళూరు టీంకు విలన్‌లా మారాడు. అర్షద్ ఖాన్ షార్ట్ పిచ్ డెలివరీతో కోహ్లీకి బిగ్ షాక్ ఇచ్చాడు. డీప్ ఫైన్ లెగ్ వద్ద ప్రసిద్ధ్ కృష్ణ చేతికి చిక్కిన కోహ్ల నిరాశగా పెవిలియన్ చేరాడు. విరాట్‌ని మౌనంగా ఉంచిన అర్షద్ ఖాన్ అసలు ఎవరో ఇప్పుడు తెలసుకుందాం..
అర్షద్ ఖాన్ కోచ్ ఎవరంటే..
అర్షద్ ఖాన్ మధ్యప్రదేశ్‌లోని సియోనిలో జన్మించాడు. ఈ ఆటగాడి తండ్రి అస్ఫాక్ స్వయంగా క్రికెట్ కోచ్. తన కొడుకు ప్రతిభను గుర్తించింది ఆయనే. అర్షద్‌కు 9 సంవత్సరాల వయసులో తనకంటే పెద్దవాళ్ళతో ఆడేవాడు. స్టార్ బౌలర్లపైనా భారీ సిక్సర్లు కొట్టేవాడు. ఈ భారీ షాట్లు చూసిన తర్వాత, అతని తండ్రి అర్షద్ ఖాన్‌ను క్రికెటర్‌గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్షద్ ఖాన్‌ను అతని తండ్రి కోచ్ అబ్దుల్ కలాం చెంతకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో క్రికెట్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అర్షద్ 11 సంవత్సరాల వయసులో అండర్-14 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అర్షద్ తన కెరీర్‌ను బ్యాట్స్‌మన్‌గా ప్రారంభించాడు. కానీ, హోషంగాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బౌలింగ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మ్యాచ్‌లో తన ఎడమ చేతి వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వేగంతో పాటు, బంతిని రెండు దిశలలో మూవ్ చేసే సామర్థ్యంతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ మాత్రమే కాదండోయ్ అర్షద్ ఖాన్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేసేవాడు.
తండ్రి జీతం ప్యూన్ కంటే తక్కువ..
అర్షద్ ఖాన్ తండ్రి అష్ఫాక్ ఖాన్ తండ్రి నెలకు 15 వేల రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. కానీ, అతను తన కొడుకుకు 16 వేల రూపాయల విలువైన కిట్ కొన్నాడు. ఈ విషయాన్ని అర్షద్ తల్లి అలియా స్వయంగా చెప్పింది. 2022లో ర్షద్ ఖాన్ అదృష్టం IPLలో కనిపించింది. ముంబై ఇండియన్స్ అతనిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఈ ఎదురుదెబ్బతో అర్షద్ చాలా నిరాశ చెందాడు. అతను సియోనీకి తిరిగి వచ్చి పిల్లలకు ఉచితంగా క్రికెట్ నేర్పించడం ప్రారంభించాడు. ఫిట్ అయిన తర్వాత, అర్షద్ ఖాన్ సియోని నుంచి జబల్పూర్ వెళ్లి అక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత 2023లో ఆర్‌సీబీపై అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ సమయంలో అర్షద్ ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు.
మూడు జట్లు మారిన అర్షద్..
అర్షద్ ఖాన్ ఐపీఎల్‌లో మూడు జట్లకు ఆడాడు. ముంబై ఇండియన్స్ తర్వాత, అతను లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఇప్పుడు గుజరాత్ జట్టులో ఉన్నాడు. అతను ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడాడు. 7 వికెట్లు తీయడంలో విజయం సాధించాడు. మరో విషయం ఏమిటంటే అర్షద్ బ్యాటింగ్ కూడా చేయగలడు. అతని పేరు మీద అర్ధ సెంచరీ ఉంది. అతని స్ట్రైక్ రేట్ 140 కంటే ఎక్కువగా ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..