Team India: మన క్రికెటర్ల కార్లను చూశారా? ధరలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. అత్యంత ఖరీదైన కారు ఎవరి దగ్గర ఉందంటే?
భారత క్రికెట్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. అందుకే కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ అండ్ బ్రాండెడ్ కార్లను మరీ కొనుగోలు చేస్తుంటారు. మరి మన క్రికెటర్లు వాడే బ్రాండెడ్ కార్లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం రండి.

Team India Cricketers
స్టార్ హీరోలు అలాగే క్రికెటర్ల విలాసవంతమైన జీవితాల గురించి తెలుసుకోవడనికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా అభిమానులు తమ ఆరాధ్య నటుడు, క్రికెటర్ల బట్టల నుంచి షూ బ్రాండ్ల వరకు ప్రతిదీ తెలుసుకోవటానికి ఇష్టపడతారు. కాగా బాలీవుడ్ ప్రముఖుల మాదిరిగానే, క్రికెటర్లు కూడా ఖరీదైన అలాగే విలాసవంతమైన కార్లను ఇష్టపడతారు. మరి మన టీం ఇండియాలోని ఏ క్రికెటర్ దగ్గర అత్యంత ఖరీదైన కారు ఉందో తెలుసుకుందాం రండి.
- భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అత్యంత ఖరీదైన కారు మెర్సిడెస్ మేబ్యాక్ S560 ఉంది. దీని ధర దాదాపు రూ.2.11 కోట్లు.
- IPL 2025లో పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్న శ్రేయాస్ అయ్యర్ దగ్గర లంబోర్గిని హురాకాన్ EVO ఉంది. దీని ధర సుమారు రూ.3.73 కోట్లు.
- IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా ఆడుతోన్న వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ KL రాహుల్ వద్ద ఆస్టన్ మార్టిన్ DB11 ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.2 కోట్లు. దీంతో పాు KL రాహుల్ వద్ద ఆస్టన్ మార్టిన్ DB11 కూడా ఉంది.
- కోహ్లీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకడు. అతని దగ్గర అత్యంత ఖరీదైన కారు బెంట్లీ కాంటినెంటల్ GT ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.04 కోట్లు. మీడియా నివేదికల ప్రకారం, బెంట్లీతో పాటు, కోహ్లీ గ్యారేజ్ లో ఆడి R8 LMX, ఆడి Q8, ఆడి RS5 తదితర లగ్జరీ కార్లు ఉన్నాయి.
- భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఇష్టపడతాడు. రోహిత్ దగ్గర లంబోర్గిని ఉరుస్ ఉంది. ఈ కారు ధర రూ.4.18 కోట్ల నుంచి రూ.4.57 కోట్ల వరకు ఉంటుంది. రోహిత్ శర్మ గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కూడా ఉంది.
- భారత జట్టులో డాషింగ్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా వద్ద అనేక రకాల కార్లు ఉన్నాయి. జడేజా దగ్గర రోల్స్ రాయిస్ వ్రైత్ అనే ఖరీదైన కారు ఉంది. మార్కెట్లో దీని షోరూమ్ ధర దాదాపు రూ.5 కోట్లు. ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ కు చేరుకుంటుంది.
- ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహించనున్న టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అత్యంత ఖరీదైన కారును కలిగి ఉన్నాడు. హార్దిక్ దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. భారతదేశంలో ఈ కారు షోరూమ్ ధర దాదాపు సుమారు రూ.9.50 కోట్లు
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి








