డివిలియర్స్‌కు కోహ్లీ, యువరాజ్ అండ!
ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టును ప్రకటించడానికి ముందు తన పేరును పరిశీలించాలని బోర్డును కోరానంటూ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. అయితే, ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించాక మళ్లీ తీసుకోబోమంటూ సౌతాఫ్రికా బోర్డు తేల్చి చెప్పేసింది. ఇటీవలే ఈ విషయాన్ని డివిలియర్స్ వెల్లడించి కొత్త చర్చకు తెరలేపాడు. ఇక, ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది. పేలవ ఆటతీరుతో లీగ్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఏబీని తీసుకుని ఉండి ఉంటే సఫారీలకు ఇంతటి పరాభం […]
ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టును ప్రకటించడానికి ముందు తన పేరును పరిశీలించాలని బోర్డును కోరానంటూ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. అయితే, ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించాక మళ్లీ తీసుకోబోమంటూ సౌతాఫ్రికా బోర్డు తేల్చి చెప్పేసింది. ఇటీవలే ఈ విషయాన్ని డివిలియర్స్ వెల్లడించి కొత్త చర్చకు తెరలేపాడు. ఇక, ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది. పేలవ ఆటతీరుతో లీగ్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఏబీని తీసుకుని ఉండి ఉంటే సఫారీలకు ఇంతటి పరాభం ఎదురై ఉండేది కాదన్న వాదన తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌లు డివిలియర్స్‌కు మద్దతు పలికారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. డివిలియర్స్ లేకుండా దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశమే లేదని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఏబీ వ్యక్తిగత ప్రపంచంలోకి ప్రజలు ప్రవేశించాలనుకోవడం దారుణమని కోహ్లీ పేర్కొన్నాడు.