ఇంతకీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా..? అనుకొని అతిథి మళ్లీ వస్తాడా..?
ప్రపంచకప్ ప్రారంభమైనప్పటినుంచి ఆ మ్యాచ్‌లను చూసేందుకు అనుకొని అతిథి దాదాపు అన్ని మ్యాచ్‌లను కలవరపెట్టాడు. ఆ అతిథి చేయబట్టి కొన్ని మ్యాచ్‌లు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ అతిథి ఎవరో.. ఇంకెవరు వరణుడు. అయితే ఈ వరణుడు చేయబట్టే మన భారత్ సెమీఫైనల్ రెండో రోజు కొనసాగింది. లేందంటే మనం గెలిచేవాళ్లమేమో.. అన్న అభిప్రాయాలు తలెత్తాయి. అయితే ఇవాళ జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు కూడా వరణుడు అడ్డంకిగా మారనున్నాడా.. అని క్రికెట్ అభిమానులు […]
ప్రపంచకప్ ప్రారంభమైనప్పటినుంచి ఆ మ్యాచ్‌లను చూసేందుకు అనుకొని అతిథి దాదాపు అన్ని మ్యాచ్‌లను కలవరపెట్టాడు. ఆ అతిథి చేయబట్టి కొన్ని మ్యాచ్‌లు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ అతిథి ఎవరో.. ఇంకెవరు వరణుడు. అయితే ఈ వరణుడు చేయబట్టే మన భారత్ సెమీఫైనల్ రెండో రోజు కొనసాగింది. లేందంటే మనం గెలిచేవాళ్లమేమో.. అన్న అభిప్రాయాలు తలెత్తాయి. అయితే ఇవాళ జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు కూడా వరణుడు అడ్డంకిగా మారనున్నాడా.. అని క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు వరణుడు ఎటువంటి అడ్డంకి కలిగించబోవడం లేదని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. లార్డ్స్‌లో ఇవాళ ఉష్ణోగ్రత 21-23 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.