Mohammed Shami: ‘ముబారక్‌ హో లాలా’.. అర్జున అవార్డు అందుకున్న షమీ మొదట ఎవరికి వీడియో కాల్ చేశాడో తెలుసా?

2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షమీని ఈసారి అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది. . 2023 ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 10.70 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు

Mohammed Shami: 'ముబారక్‌ హో లాలా'.. అర్జున అవార్డు అందుకున్న షమీ మొదట ఎవరికి వీడియో కాల్ చేశాడో తెలుసా?
Mohammed Shami
Follow us

|

Updated on: Jan 10, 2024 | 7:38 AM

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్‌ షమీ దేశ రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. మంగళవారం (జనవరి 10) ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షమీని ఈసారి అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది. . 2023 ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 10.70 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు. దీంతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ అద్భుత ప్రదర్శన కారణంగా వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అయితే కీలక మ్యాచ్‌లో తడబడడం ద్వారా భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీ అంతటా అతని ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని షమీ పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు. దీంతో ఈ టీమిండియా క్రికెటర్‌కు భారతదేశంలో 2వ అత్యున్నత క్రీడా గౌరవం లభించింది. ఇక తనకు అవార్డు రావడంపై షమీ స్పందించాడు. సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు. ‘నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. నా కోచ్‌, బీసీసీఐ, తోటి ఆటగాళ్లు, నా కుటుంబం, సిబ్బంది, ఫ్యాన్స్‌ అందరూ నాకు అండగా నిలిచారు. నా శాయశక్తులా ఆడి దేశాన్ని గర్వపడేలా చేస్తాను. అర్జున పురస్కారం పొందిన ఇతరులకూ నా అభినందనలు’ అని షమీ తెలిపారు.

మరోవైపు అర్జున అవార్డు అందుకున్న షమీకి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ మహ్మద్‌ షమీని ప్రత్యేకంగా అభినందించాడు. ‘ముబారక్‌ హో లాలా’ విషెస్‌ తెలిపాడు. ఇక అర్జున పురస్కారాన్ని స్వీకరించిన వెంటనే ఉత్తరాఖండ్‌లోని ఖాన్‌పూర్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ కుమార్‌కు వీడియో కాల్‌ చేశారు టీమిండియా స్టార్‌ బౌలర్‌. అర్జున అవార్డును చూపిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు సదరు ఎమ్మెల్యే ట్వీట్‌ చేశారు. షమీతో పాటు బ్యాడ్మింటన్ స్టార్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించారు. 2023లో బ్యాడ్మింటన్‌లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసినందుకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వీరిద్దరికి ఖేల్ రత్న ప్రదానం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..