ఊరించి.. ఐపీఎల్ ఊసురుమనిపించింది.. కట్ చేస్తే.. 15 ఫోర్లు, 11 సిక్సర్లతో బుడతడి పెను తుఫాన్

ఊరించి ఊసురుమనిపించింది ఐపీఎల్ మెగా ఆక్షన్. ఏ ఫ్రాంచైజీనైనా తనను కొనుగోలు చేస్తుందని అనుకున్నాడు. కానీ అందరూ మొండిచెయ్యి చూపించారు. కట్ చేస్తే.. డొమెస్టిక్ క్రికెట్‌లో శివాలెత్తించాడు ఈ ప్లేయర్. తానేంటో నిరూపించుకుని.. అదిరిపోయే సెంచరీ చేశాడు. ఇంతకీ అతడెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

ఊరించి.. ఐపీఎల్ ఊసురుమనిపించింది.. కట్ చేస్తే.. 15 ఫోర్లు, 11 సిక్సర్లతో బుడతడి పెను తుఫాన్
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2025 | 1:07 PM

క్రికెట్‌లో ఏజ్‌తో పన్లేదు. ఆటగాడి స్కిల్స్ మాత్రమే ఇంపార్టెంట్. మొన్నటికి మొన్న ఐపీఎల్‌కి ఎంపికైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్మురేపగా.. ఇప్పుడు 17 ఏళ్ల ఆయుష్ మాత్రే తానేంటో చూపించాడు. తన బ్యాట్‌తో ముంబైకి పరుగుల వర్షం కురిపించాడు. నాగాలాండ్ బౌలర్ల బ్యాండ్ వాయించాడు. ఇదంతా కూడా విజయ్ హజారే ట్రోఫీలో జరిగింది. ఆ మ్యాచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

డిసెంబర్ 31న విజయ్ హజారే ట్రోఫీలో నాగాలాండ్‌తో ముంబై తలబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబైకి 17 ఏళ్ల ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కి 156 పరుగులు జోడించారు. ఆ తర్వాత అంగ్క్రిష్ ఔట్ అయినప్పటికీ.. ఆయుష్ మాత్రే క్రీజులో నిలబడి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే తుఫాను సెంచరీతో తన జట్టు భారీ స్కోర్ సాధించేలా చేశాడు. నాగాలాండ్‌పై 117 బంతులు ఎదుర్కొన్న ఆయుష్ మాత్రే మొత్తంగా 181 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీకి కేవలం 19 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 154 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 11 సిక్సర్లు, 15 ఫోర్లు బాదాడు. ఈ 17 ఏళ్ల బ్యాటర్‌కు లిస్ట్ ఏ కెరీర్‌లో ఇది తొలి సెంచరీ. ఇక ఆయుష్‌ సెంచరీతో నాగాలాండ్‌పై ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 403 పరుగులు చేసింది. లిస్ట్ ఏ క్రికెట్‌లో ముంబై జట్టు సాధించిన రెండో అత్యధిక స్కోర్ ఇది. కాగా, ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీతో కలిసి ప్రత్యర్థులను చిత్తు చేశాడు ఈ 17 ఏళ్ల ఆయుష్ మాత్రే. వైభవ్‌తో కలిసి జపాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ను కేవలం 16 ఓవర్లలోనే ముగించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి