Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్ టాక్ లీక్.. టీమిండియా ఆటగాళ్లపై నోరుపారేసుకున్న గంభీర్.. ఇక చాలు అంటూ..
కొత్త ఏడాది తొలి రోజే టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఇప్పటికే నాలుగో టెస్టులో టీమిండియా ప్లేయర్లు ప్రదర్శన చూసి నిరాశచెందిన ఫ్యాన్స్‌కి మరో పిడుగు లాంటి వార్త.. ఇంతకీ అది ఏంటంటే.. . టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో లీక్ కావడం అందర్నీ షాక్ గురిచేసింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా వెనుకబడింది. విజయంతో సిరీస్‌ను ప్రారంభించిన భారత జట్టు గత 3 మ్యాచ్‌ల్లో 2 ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కూడా టీమిండియా చాలా చెత్త ప్రదర్శన చేసింది. యంగ్ ప్లేయర్లు జైస్వాల్, నితీశ్ కూమార్ రెడ్డి, పేసర్ బుమ్రాలు తప్ప మిగితా ఎవరు పెద్దగా పదర్శన కనబరచలేదు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది తొలిరోజే ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ విషయం లీక్ అయింది.
మీడియా కథనాల ప్రకారం, టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతవరణం అంతా బాగా ఏమి లేదని తెలుస్తుంది. మెల్‌బోర్న్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద దుమారమే రేగింది. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భారత బ్యాట్స్‌మెన్‌ల ఆటతీరుపై గౌతమ్ గంభీర్ ఏమాత్రం సంతోషంగా లేడని, మెల్‌బోర్న్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి సహా మొత్తం భారత జట్టుపై గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే విరుచుకుపడ్డినట్లు తెలుస్తుంది. గంభీర్ ఆటగాళ్లను ఉద్దేశించి మీరు ఇప్పటికైనా మేల్కొన్నారా అని తిట్టినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా భవిష్యత్తులో తన వ్యూహాన్ని పాటించని వారిని కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని గంభీర్ ఆటగాళ్లను హెచ్చరించాడు. జూలై 9న కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గంభీర్ ఇప్పటివరకు ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. అయితే, ఇటీవల పేలవమైన ఆటతీరుతో విసిగిపోయిన అతను ఇప్పుడు ఆటగాళ్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఫైట్‌తో పాటు.. టీమిండియా ఎంపిక విషయంలో కూడా ఓ పెద్ద విషయం రివీల్ అయింది. ఈ BGT టెస్టు సిరీస్ గంభీర్‌కి ఇదే తొలి పర్యటన.. ఈ టూర్‌లో అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ భావించాడు. కానీ అతని మాటలను భారత సెలక్టర్లు అంగీకరించలేదు. ఆస్ట్రేలియాలో ఛెతేశ్వర్ పుజారా గణాంకాలు బాగా ఆకట్టుకున్నాయి, క్రీజులో ఎక్కువ సమయం ఎలా గడపాలో అతనికి తెలుసు అని గంభీర్ సెలక్టర్లుతో చెప్పినట్లు సమాచారం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టులో లేరు. దీంతో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే బుమ్రాను కెప్టెన్‌గా చేయడానికి జట్టులోని ఒక ఆటగాడు ఇష్టపడలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆటగాళ్ల మధ్య కొంత వైరుధ్యం ఉందని, అది ఆటపై ప్రభావం చూపుతున్నదని స్పష్టమైంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ నుండి ఈ విషయాలన్నీ లీక్ కావడంతో భారత క్రికెట్‌లో కలకలం రేగింది. దీనిపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఒక పోస్ట్‌లో డ్రెస్సింగ్ రూమ్ లీక్ కావడంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమి జరుగుతుందో డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఉండాలి!’ ఆయన పేర్కొన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి