IND vs AUS: ఉప్పల్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయాల్లో గందరగోళం.. లెక్క చెప్పాలంటూ హెచ్‌సీఏకు క్రీడామంత్రి ఆదేశాలు

Srinivas Goud: భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్‌ వేదికగా ఈనెల 25న మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. కరోనా ఆరంభమయ్యాక ఈ స్టేడియంలో ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు జరగకపోవడంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆరాటపడుతున్నారు

IND vs AUS: ఉప్పల్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయాల్లో గందరగోళం.. లెక్క చెప్పాలంటూ హెచ్‌సీఏకు క్రీడామంత్రి ఆదేశాలు
Srinivas Goud
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2022 | 8:04 PM

Srinivas Goud: భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్‌ వేదికగా ఈనెల 25న మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. కరోనా ఆరంభమయ్యాక ఈ స్టేడియంలో ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు జరగకపోవడంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆరాటపడుతున్నారు. ఇదే సమయంలో టికెట్ల జారీ విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది. సుమారు 55వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్‌ స్టేడియంలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (HCA)పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్‌ టికెట్ల కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాభిమానులు జింఖానా మైదానానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల జారీలో ఏర్పడిన గందరగోళంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. ‘భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతాం. టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చితే సీఎం కేసీఆర్‌ సహించరు. మొత్తం ఎన్ని టికెట్స్‌ ఉన్నాయి? ఎన్ని సేల్‌ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్‌ కేటాయిస్తున్నారో చెప్పాలి’ అని హెచ్‌సీఏను ఆదేశించారు.

కాగా గురువారం ప్రిన్సిపల్‌ సెక్రటరీతో కలిసి ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలిస్తానని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మరోవైపు బ్లాక్‌లో టికెట్ల విక్రయాలను హెచ్‌సీఏ ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. టికెట్ల కోసం గత మూడు రోజులుగా జింఖానా మైదానానికి వస్తున్నా హెచ్‌సీఏ నుంచి ఎలాంటి స్పందనా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నప్పటికీ వెంటనే నగదును రిఫండ్‌ చేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..