IND vs AUS: టీవీ9 ఇంపాక్ట్.. నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో ఉప్పల్ మ్యాచ్ టికెట్లు.. ఎలా పొందాలంటే?
Hyderabad: టీవీ9 నాన్‌స్టాప్ కథనాలతో దిగొచ్చింది HCA. భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్స్‌ను ఇవాళ్టి నుంచి ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Hyderabad: క్రికెట్… ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ ఊగిపోతారు. పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అలాంటిది, మన హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంటే, స్టేడియంలో కూర్చొని లైవ్‌లో చూడాలని ఏ క్రికెట్ లవర్‌కి మాత్రం ఉండదు. అదే ఆశించారు క్రికెట్ ఫ్యాన్స్. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హైదరాబాద్ వేదికగా జరగబోతున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ను స్టేడియంలో చూసేందుకు ఆశపడ్డ క్రికెట్ ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించింది HCA. మ్యాచ్ టికెట్ల విక్రయంపై వారం రోజులుగా గేమ్ ఆడింది. ఇవాళారేపు అంటూ క్రికెట్ లవర్స్‌తో ఆటలాడింది. దీంతో టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ దగ్గర రోజుల తరబడి పడిగాపులు పడ్డారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో HCA తీరును ప్రశ్నిస్తూ వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ9. మూడు నాలుగు రోజులుగా క్రికెట్ లవర్స్ ఆవేదనను తెలియజేసింది. టీవీ9 నాన్‌స్టాప్ కథనాలతో చివరికి దిగొచ్చింది HCA. ఇవాళ్టి నుంచి భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
టికెట్ల విక్రయం కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో కౌంటర్స్ ఏర్పాటు చేసింది. ఒక్కరికి రెండు టికెట్లు మాత్రమే ఇవ్వనుంది HCA. టికెట్స్ కావాల్సినవాళ్లు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నిబంధనలు పెట్టింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు టికెట్స్ విక్రయించనున్నట్లు వెల్లడించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 25న టీ20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 55వేలు. మరి, ఎన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..