ICC T20I Rankings: దూసుకోస్తోన్న సూర్య.. పడిపోతోన్న బాబర్.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఎక్కడంటే?
Ind vs Aus: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) అదరగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించి ఏకంగా మూడో ప్లేస్‌కు చేరుకున్నాడు.
Ind vs Aus: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) అదరగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించి ఏకంగా మూడో ప్లేస్‌కు చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా జరిగిన మొదటి టీ20లో సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం 25 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 46 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం 780 పాయింట్లతో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన టాప్ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్కరమ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఆసియా కప్ టోర్నీలో విఫలమైన బాబర్ నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. అదే సమయంలో ఆసీస్‌తో తొలి టీ20లో విఫలమైన టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ఒక ర్యాంకు కోల్పోయి పదహారో స్థానానికి పడిపోయాడు.
కాగా ఆసీస్‌తో తొలి టీ20లలో 11 పరుగులే చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. కానీ ఇదే మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు పైకి ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మొదటిసారిగా టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్-10లో ఇండియా నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే స్థానం దక్కించుకున్నాడు. 673 పాయింట్లతో అతను 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..