IND vs ENG: ఉప్పల్‌లో భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు

Hyderabad Traffic: గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈనెల 29 వరకు అంటే మొత్తం ఐదు రోజుల పాటు జరగనుంది.

IND vs ENG: ఉప్పల్‌లో భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు
India Vs England
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2024 | 6:44 PM

Hyderabad Traffic: గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈనెల 29 వరకు అంటే మొత్తం ఐదు రోజుల పాటు జరగనుంది. మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ కూడా షురూ చేశాయి. సుమారు ఆరేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా నగరవాసులతో పాటు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో స్టేడియంలోకి క్రికెట్ ప్రేక్షకులను ఉదయం 6.30 నిమిషాలకే అనుమతించనున్నారు. గ్రౌండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కొనసాగే ఐదు రోజుల పాటు ఉప్పల్‌ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

వాహనాల పార్కిగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్‌తో పాటు ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, ఉప్పల్‌ మైదానం వైపు వచ్చే మార్గాలను దారి మళ్లిస్తున్నారు. కార్లు, బైక్స్‌, ఇతర వాహనాల పార్కింగ్ కోసం మొత్తం 15 స్థలాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి గురించి తెలుసుకునేందుకు రహదారులపై మాస్టర్ డైరెక్షనల్ బోర్డులు, లోకేషన్ మ్యాప్ లను సైతం ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వైపు వెళ్లే మార్గాల్లోనూ మాస్టర్‌ డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎక్స్ జంక్షన్ రోడ్డు, స్ట్రీట్ నెం.8 జంక్షన్, హబ్సిగూడ జంక్షన్, ఏక్ మినార్ మసీదు, తదితర ప్రాంతాల్లోనూ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు250 మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. నగరవాసులు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులను గమనించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఉప్పల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు..

మ్యాచ్ ను వీక్షించనున్న జైషా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..