IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో 5 అద్భుత రికార్డులు.. బ్రేక్ చేయాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే..?
Unbreakable IPL Records: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మరియు సన్ రైజర్స్ జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. అయితే ఈ కొత్త సీజన్ ఉత్సాహంలో ఉండగానే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఐదు అసాధారణ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Unbreakable IPL Records: క్రికెట్ లో రికార్డులు పుట్టేదే బద్దలు కొట్టడానికి అంటారు. కానీ ఐపీఎల్ లోని కొన్ని రికార్డులు చూస్తే అవి తిరగరాయడం దాదాపు అసాధ్యమనిపిస్తుంది. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో బ్రేక్ చేయలేని రికార్డుల గురించి మాట్లాడితే ఈ లిస్ట్ లో దాదాపు 5 రికార్డులు ఉంటాయి. అవేంటో ఓసారి చూద్దాం..
1. అల్జారీ జోసెఫ్ అరంగేట్రం వేట: వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ 2019లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేస్తూనే సంచలనం సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. డెబ్యూ మ్యాచ్ లోనే ఇంతటి అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఏ బౌలర్‌కైనా కల లాంటిదే. ఇప్పటి వరకు ఏ అగ్రశ్రేణి బౌలర్ కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి రాలేకపోయారు.
2. క్రిస్ గేల్ విశ్వరూపం.. 175 పరుగులు: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 2013లో పూణే వారియర్స్ పై ఆడిన ఇన్నింగ్స్ ఒక సునామీలాంటిది. కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు సాధించి టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇందులో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఈ రికార్డును బ్రేక్ చేయడం ప్రస్తుత తరం బ్యాటర్లకు పెను సవాలే.
3. కేకేఆర్ వరుస విజయాల పరంపర: గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ 2014, 2015 సీజన్ల మధ్య వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒకే టోర్నీలో లేదా వరుసగా ఇన్ని విజయాలు అందుకోవడం జట్టు సమష్టి కృషికి నిదర్శనం. నేటి పోటీ తత్వంతో కూడిన ఐపీఎల్ లో ఇది దాదాపు అసాధ్యం.
4. అమిత్ మిశ్రా హ్యాట్రిక్ మ్యాజిక్: ఐపీఎల్ లో ముగ్గురు బ్యాటర్లను వరుస బంతుల్లో అవుట్ చేయడం (హ్యాట్రిక్) ఒక ఎత్తు అయితే.. అలాంటి హ్యాట్రిక్ లను మూడు సార్లు సాధించడం అమిత్ మిశ్రాకే సాధ్యమైంది. ఢిల్లీ, హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్ జట్ల తరపున ఆయన ఈ ఘనత సాధించారు. యుజ్వేంద్ర చాహల్ కు ఈ రికార్డును సమం చేసే అవకాశం ఉన్నప్పటికీ మూడు హ్యాట్రిక్ లు అంటే చిన్న విషయం కాదు.
5. కోహ్లీ.. డివిలియర్స్ అజేయ భాగస్వామ్యం: 2016లో గుజరాత్ లయన్స్ పై విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ రెండో వికెట్ కు 229 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ లో ఇదే అత్యధిక పార్టనర్ షిప్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండో అత్యధిక భాగస్వామ్యం (215 పరుగులు) కూడా వీరిద్దరి పేరిట ఉండటం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
