AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీమిండియా కెప్టెన్‌కు తలనొప్పిలా మారిన లేడీ క్రిస్ గేల్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Most Sixes in Womens T20I World Cup: మహిళా టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు ముందుకు సాగుతున్న కొద్దీ రికార్డుల వేట మరింత ఆసక్తికరంగా మారుతోంది. డియాండ్రా డాటిన్ సృష్టించిన సిక్సర్ల రికార్డును ప్రస్తుత టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ లేదా షెఫాలీ వర్మ అధిగమిస్తారా, లేక డాటిన్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందా అనేది చూడాలి. ఏదేమైనా ఈ పోరు క్రికెట్ ప్రియులకు అసలైన వినోదాన్ని అందిస్తోంది.

T20 World Cup: టీమిండియా కెప్టెన్‌కు తలనొప్పిలా మారిన లేడీ క్రిస్ గేల్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Womens T20 World Cup Most Sixes Deandra Dottin
Venkata Chari
|

Updated on: Jun 16, 2026 | 6:18 PM

Share

Most Sixes in Womens T20I World Cup: మహిళా టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఇరు జట్లూ తలపడుతుంటే రికార్డులు బద్దలవుతున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీలో సిక్సర్ల రికార్డు అనగానే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ డియాండ్రా డాటిన్ పేరే గుర్తొస్తుంది. మహిళా క్రికెట్ ప్రపంచంలో ‘క్రిస్ గేల్’గా పేరొందిన ఆమె రికార్డును తిరగరాయడం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఒక సవాల్‌గా మారింది.

సిక్సర్ల సునామీ.. పురుషుల్లో గేల్.. మహిళల్లో డాటిన్..!

టీ20 క్రికెట్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది సిక్సర్ల వీరుడు, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్. పురుషుల టీ20 ప్రపంచకప్‌లో 33 మ్యాచ్‌లాడి ఏకంగా 63 సిక్సర్లు బాదిన రికార్డు గేల్ పేరిట ఉంది. సరిగ్గా అదే తరహా విధ్వంసాన్ని మహిళా క్రికెట్‌లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ సృష్టించింది. ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో 36 మ్యాచ్‌లు ఆడిన డాటిన్, 31 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె క్రీజులోకి వచ్చిందంటే చాలు బంతి గాల్లో తేలాల్సిందే. అందుకే అభిమానులు ఆమెను లేడీ క్రిస్ గేల్ అని పిలుచుకుంటారు.

రెండో స్థానంలో మన కెప్టెన్.. సవాల్ అంత సులువు కాదు!

మహిళల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో స్థానంలో ఉంది. హర్మన్‌ప్రీత్ ఇప్పటివరకు 40 మ్యాచ్‌లలో 19 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగింది. న్యూజిలాండ్ స్టార్ సోఫీ డివైన్ కూడా 19 సిక్సర్లతో హర్మన్‌ప్రీత్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత టోర్నీలో డాటిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే భారత కెప్టెన్‌కు ఇంకా 12 సిక్సర్లు అవసరం. మొదటి మ్యాచ్‌లో 36 పరుగులతో రాణించినప్పటికీ, హర్మన్‌ప్రీత్ ఖాతాలో ఒక్క సిక్సర్ కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో డాటిన్ మైలురాయిని అందుకోవడం హర్మన్‌ప్రీత్‌కు కొండను తవ్వినంత పనే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

టాప్-10 లో భారతీయులు.. దూసుకొస్తున్న షెఫాలీ వర్మ..

ఈ రికార్డుల జాబితాలో టాప్-10లో నిలిచిన మరో భారతీయ క్రీడాకారిణి యువ ఓపెనర్ షెఫాలీ వర్మ. కేవలం 15 మ్యాచ్‌ల్లోనే 11 సిక్సర్లు బాదిన ఈ యువ సంచలనం, భవిష్యత్తులో నంబర్ వన్ స్థానానికి చేరుకునేలా కనిపిస్తోంది. టీమిండియా మరో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సైతం 26 మ్యాచ్‌ల్లో 13 సిక్సర్లతో ఈ జాబితాలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఈ భారత ఆటగాళ్లు మరిన్ని సిక్సర్లతో విరుచుకుపడి రికార్డుల వేటలో ముందుకు సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us