Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: నిషేధం విధించండి..! BCCI, IPL చైర్మన్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ

భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకున్న తరువాత, కేంద్ర ఆరోగ్య శాఖ ఐపీఎల్ 2025లో పొగాకు, మద్యం ప్రచారంపై నిషేధం విధించాలని బీసీసీఐని కోరింది. పొగాకు, మద్యం వల్ల దేశంలో అధిక మరణాలు సంభవిస్తున్నాయని, ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ విషయంపై ఐపీఎల్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

IPL 2025: నిషేధం విధించండి..! BCCI, IPL చైర్మన్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ
Jay Shah Ipl 2025
Follow us
SN Pasha

|

Updated on: Mar 10, 2025 | 2:48 PM

భారత క్రికెట్‌ అభిమానులంతా కోరుకున్నట్లు టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను కైవసం చేసుకుంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన అద్భుత విజయం సాధించి.. మూడో సారి ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. గతంలో 2000వ సంవత్సరంలో సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా, శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2013లో ధోని కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టింది. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగియడంతో ఇక క్రికెట్‌ అభిమానుల దృష్టి ఐపీఎల్‌ వైపు మళ్లనుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఈ మెగా సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఐపీఎల్‌ కమిటీతో పాటు బీసీసీఐకి ఒక కీలక రాసింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్లో పొగాకు(టొబాకో), ఆల్కాహాల్‌ ఉత్పత్తులను ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ప్రచారం కల్పించడంపై నిషేదం విధించాలంటూ కోరింది. ఆటగాళ్లు, కామెంటేటర్లు, ఐపీఎల్‌ టీమ్స్‌.. పొగాకు, మద్యం బ్రాండ్‌లకు ప్రచారం కల్పించడం, వాటిని స్పాన్సర్లుగా చేర్చుకోవడం వంటివి బంద్‌ చేయాలని కోరింది. ఈ విషయమై మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ గోయల్‌, బీసీసీఐకి, అలాగే ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరున్‌ సింగ్‌ ధుమల్‌లకు లేక రాశారు. దేశంలో చాలా మంది టొబాకో, మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఈ లేఖలో అతుల్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్‌లో గుండె సంబంధ, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, మధుమేహం, రక్తపోటు వంటి ఎన్‌సీడీ (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్‌) పెరుగుల స్థాయిని కూడా లేఖలో ప్రస్తావించారు.

మన దేశంలో వార్షిక మరణాలలో 70 శాతం ఎక్కువ మరణాలు వీటి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొగాకు, మద్యం వాడకం ఎన్‌సీడీలకు కీలకమైన ప్రమాద కారకాలు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు సంబంధిత మరణాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది, ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో ఆల్కహాల్ ఎక్కువగా ఉపయోగించే సైకోయాక్టివ్ పదార్థంగా మిగిలిపోయింది అని గోయెల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆరోగ్య విధానాలు, చట్టాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ప్రకటనలను ఐపీఎల్‌ కమిటీ కచ్చితంగా నియంత్రించాలని కోరారు. మరి దీనిపై ఐపీఎల్‌ కమిటీ, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..