- Telugu News Photo Gallery Sports photos Champions Trophy 2025 three indian players not even played one match they also receive medals
Champions Trophy: ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఛాంపియన్లుగా నిలిచిన ముగ్గురు భారత ఆటగాళ్లు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో తొలిసారి, ధోని కెప్టెన్సీలో రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్, ఇప్పుడో రోహిత్ కెప్టెన్సీలో మూడో కప్పు కొట్టింది.
SN Pasha |
Updated on: Mar 10, 2025 | 3:37 PM

ఆదివారం టీమిండియా సాధించిన విజయంతో భారత దేశం మొత్తం సంబురాల్లో మునిగిపోయింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేన.. ఈ ఏడాది ఆరంభంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దే లేదు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఆటగాళ్లను ఐసీసీ మెడల్స్‌తో పాటు వైట్ బ్లేజర్లతో సత్కరించింది. కాగా, ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఓ ముగ్గురు భారత ఆటగాళ్లు కూడా ఛాంపియన్లు అయ్యారు. మెడల్స్, వైట్ బ్లేజర్లలో వాళ్లు కూడా సందడి చేశారు. మొత్తం 15 మంది స్క్వౌడ్‌కు మెడల్స్ అందజేశారు. వారిలో ముగ్గురు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

రిషభ్ పంత్.. టీమిండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉన్న రిషభ్ పంత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాపం ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. జట్టులో సీనియర్ ప్రోగా ఉన్న కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ భావించడంతో పంత్‌కు ప్లేయింగ్‌లో చోటు దక్కలేదు. అలాగే అక్షర్ పటేల్ రూపంలో మిడిల్డార్‌లో ఆడే లెఫ్ట్ హ్యా్ండర్ ఉండటం కూడా పంత్‌కు మైనస్‌గా మారింది.

అర్షదీప్ సింగ్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు జట్టులో కీ ప్లేయర్ అవుతాడు అనుకున్న అర్షదీప్ సింగ్‌కు కూడా ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. దుబాయ్‌లో టీమిండియా ఆడిన పిచ్‌లు స్పిన్ ట్రాకులు కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో అర్షదీప్ సింగ్‌కు ఆడే అవకాశం రాలేదు. జట్టులో సీనియర్ బౌలర్‌గా షమీ మెయిన్ పేస్ ఎటాకర్‌గా ఉండటంతో అర్షదీప్‌కు చోటు దక్కలేదు.

వాషింగ్టన్ సుందర్.. ఈ టోర్నీలో స్పిన్నర్ల బలంతో టీమిండియా మ్యాచ్‌లు నెగ్గింది. ఏకంగా ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లలో టీమిండియా అద్భుతాలు చేసింది. అయినా కూడా భారత స్క్వౌడ్‌లో మరో స్పిన్ ఆల్‌రౌండర్ కూడా ఉన్నాడు. అతనే వాషింగ్టన్ సుందర్. ఇతనికి కూడా ప్లేయింగ్‌లో చోటు దక్కలేదు. జట్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఆడటం, రైట్ ఆర్మ్ స్పిన్నర్లలో వరణ్ చక్రవర్తి మిస్టరీ బౌలర్‌గా ఉండటం, ఇటీవలె మంచి ప్రదర్శనలు చేయడంతో వాషింగ్టన్ సుందర్‌కి బదులుగా వరుణ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. ఇలా ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఈ టోర్నీలో టీమిండియా మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, సెమీ ఫైనల్, ఫైనల్ కలిసి ఐదు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో హర్షిత్ రాణాను ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్ మూడో మ్యాచ్‌లో రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్‌లోకి తీసుకుంది. ఇలా 15 మంది స్క్వాడ్‌లో కేవలం 12 మందికి మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే ఛాన్స్ దక్కింది. మిగతా ముగ్గురు ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. జట్టుకు సపోర్ట్‌గా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ అయితే సబ్‌స్టిట్యూడ్ ఫీల్డర్‌గా తన సేవలు అందించాడు. వీరు ముగ్గురు మ్యాచ్‌లు ఆడకపోయినా.. స్క్వౌడ్‌లో వాళ్లు ఉండటం ఎంతో కీలకం. సో వాళ్లు కూడా మనకు ఛాంపియన్సే.





























