- Telugu News Photo Gallery Cricket photos KL Rahul proved to be a good finisher for Team India in Champions Trophy 2025 after Gautam Gambhir Key Decision
గంభీర్ సంచలన నిర్ణయం.. కట్‌చేస్తే.. టీమిండియాకు దొరికిన మరో ‘ధోని’.. ఫినిషింగ్‌తోనే పిచ్చెక్కిస్తున్నాడుగా
Team India New Finisher: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీం ఇండియా విజయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం కీలక మలుపుగా మారింది. టోర్నమెంట్ ప్రారంభంలో అతను జట్టులోని ఒక ఆటగాడికి కొత్త బాధ్యతను అప్పగించాడు. ఈ ఆటగాడు తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు.భారతదేశాన్ని ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
Updated on: Mar 10, 2025 | 10:59 AM

Champions Trophy 2025: టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గంభీర్ కోచ్ అయిన తర్వాత, టీం ఇండియాలో భారీ మార్పులు కనిపించాయి. భారత ఆటగాళ్ళు భిన్నమైన మనస్తత్వంతో దూకుడు క్రికెట్ ఆడుతున్నారు. ఇది ప్రయోజనకరంగా కూడా నిరూపింతమవుతోంది. గంభీర్ హయాంలో ఇది టీమ్ ఇండియా మొదటి ఐసీసీ ఈవెంట్. ఇందులో విజయం కూడా సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంలో గంభీర్ తీసుకున్న ఒక నిర్ణయం కీలక పాత్ర పోషించింది. ఇది టీం ఇండియా భారీ లోపాన్ని తొలగించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పు చేయాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నాడు. అక్షర్ పటేల్‌కు 5వ స్థానంలో ఆడే బాధ్యత ఇచ్చాడు. కాగా, కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడించాడు. గంభీర్ ఈ ఎత్తుగడ పూర్తిగా సరైనదని నిరూపింతమైంది. కేఎల్ రాహుల్ ఈ టోర్నమెంట్‌లో బిగ్ మ్యాచ్ ఫినిషర్‌గా నిలిచాడు. తన అద్భుతమైన ఫినిషింగ్ నైపుణ్యాలతో, అతను అనేక కీలక మ్యాచ్‌లలో టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించాడు. ఎటువంటి ఒత్తిడిలోనైనా బాగా రాణించగల సామర్థ్యం తనకు ఉందని నిరూపించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కేఎల్ రాహుల్ తన ఫినిషింగ్ నైపుణ్యాలతో అందరికీ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. ఎంఎస్ ధోని తన ఆత్మవిశ్వాసం, ప్రశాంత స్వభావం, పరిస్థితికి తగ్గట్టు ఆడడంలో ప్రసిద్ధి చెందాడు. అతను టీం ఇండియా తరపున చాలా మ్యాచ్‌లకు మాంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ధోని ఎప్పుడూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే పెవిలియన్‌కు తిరిగి వచ్చేవాడు. ఈసారి కూడా కేఎల్ రాహుల్ అలాంటిదే చేశాడు. తన దృఢమైన బ్యాటింగ్‌తో భారత జట్టును ఇబ్బందుల నుంచి బయటపడేసి విజయపథంలో నడిపించాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు రాహుల్ పరుగులు సాధించడమే కాకుండా మ్యాచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని మ్యాచ్‌ను ముగించాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు. ఆ సమయంలో అతనికి 4 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ 4 మ్యాచ్‌లలో రాహుల్ 140.00 సగటుతో 140 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 సార్లు మ్యాచ్‌కు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చి నాటౌట్‌గా నిలిచాడు.

టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పరుగుల వేటలో అతను 47 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆ తరువాత, ఆస్ట్రేలియాపై లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, అతను 34 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేశాడు. ఆ తరువాత, అతను ఫైనల్‌లో కూడా ఒత్తిడిలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 33 బంతుల్లో అజేయంగా 34 పరుగులు చేసి జట్టును టైటిల్‌ను అందించాడు.




