Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB: డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీపైనే ప్రాంక్‌.. అంత గుండె ధైర్యం ఎవరికుంది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్‌సీబీ విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాడు టిమ్ డేవిడ్ విరాట్ కోహ్లీపై సరదా ప్రాంక్ చేశాడు. కోహ్లీ బ్యాట్‌ను దాచి, అతన్ని ఆటపట్టించాడు. కోహ్లీ తన బ్యాట్‌ మిస్ అయిన విషయం గమనించి, చివరకు ప్రాంక్ అని గుర్తించి సరదాగా నవ్వుకున్నారు.

RCB: డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీపైనే ప్రాంక్‌.. అంత గుండె ధైర్యం ఎవరికుంది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Tim David Pranks Virat Kohl
Follow us
SN Pasha

|

Updated on: Apr 14, 2025 | 6:15 PM

రాజస్థాన్ రాయల్స్ పై విజయం తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అందర్ని ఆటపట్టించే విరాట్‌ కోహ్లీపైనే ఓ ప్లేయర్‌ ప్రాంక్‌ ప్లే చేశాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ ఎలా రియాక్ట్‌ అయ్యాడు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్‌ఆర్‌పై విక్టరీ తర్వాత ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీపై సదరాగా ప్రాంక్‌ ప్లే చేశాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ కిట్ బ్యాగ్ నుంచి బ్యాట్‌ తీసి తన బ్యాగ్‌లో దాచేశాడు డేవిడ్‌. కొద్ది సేపటి తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చిన కోహ్లీ తన కిట్‌ బ్యాట్‌ సర్దుకుంటూ.. ఒక బ్యాట్‌ మిస్‌ అయినట్లు గుర్తించాడు. కానీ, ఎవరినీ అడగలేదు.

తానే ఎక్కడైనా పెట్టి మర్చిపోయనేమో అన్నట్లు కొద్ది సేపు ఆలోచించాడ. బ్యాట్‌ కోసం చుట్టూ చూశాడు, చివరికి ఎవరో కావాలనే తనపై ప్రాంక్ చేస్తూ.. బ్యాట్‌ను దాచారనే విషయాన్ని కోహ్లీకి అర్థమైంది. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సరదా వాతావరణం ఏర్పడింది. అంతా ఘోల్లుగా నవ్వుకున్నారు. టిమ్‌ డేవిడ్‌ బ్యాగ్‌ నుంచి కోహ్లీ తన బ్యాట్‌ను తానుతీసుకున్నాడు. సరదాగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసంది. విరాట్‌ కోహ్లీపైనే ప్రాంక్‌ చేశాడంటే.. టిమ్‌ డేవిడ్‌కు గుండె ధైర్యం ఎక్కువే భయ్యా అంటూ క్రికెట్ ఫ్యాన్స్‌ కూడా సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆర్‌ఆర్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది ఆర్సీబీ. 174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేసి, తన క్లాసిక్ స్ట్రోక్‌ప్లే, అనుభవాన్ని ప్రదర్శించి ఇన్నింగ్స్‌ను సమర్ధవంతంగా నడిపించాడు. ఫిల్ సాల్ట్ కేవలం 33 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేర్చింది ఆర్సీబీ. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సొంతం చేసుకుంది. తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం బెంగళూరులోని వారి సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..