IPL 2024: టైమింగ్ కూడా చూసుకోవాలి కదా గురూ! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్టెన్లు

ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇప్పటికే సగం మార్గం పూర్తి చేసుకుంది. అన్ని జట్లు తలా 7 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అట్టడుగు స్థానంలో ఉంది.

IPL 2024: టైమింగ్ కూడా చూసుకోవాలి కదా గురూ! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్టెన్లు
IPL 2024
Follow us

|

Updated on: Apr 19, 2024 | 7:22 PM

ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇప్పటికే సగం మార్గం పూర్తి చేసుకుంది. అన్ని జట్లు తలా 7 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. అయితే ఈసారి ఐపీఎల్‌లో ఐదు జట్ల కెప్టెన్లు ఒక మ్యాచ్‌ నిషేధానికి అడుగు దూరంలో నిలిచారు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే బీసీసీఐ తో అక్షింతలు వేయించుకున్న ఈ యంగ్ కెప్లెన్లు మరొక సారి ఇదే తప్పును పునరావృతం చేస్తే ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోక తప్పదు. వాస్తవానికి స్లో ఓవర్ నిబంధనను పాటించనందుకు ఐదు జట్ల కెప్టెన్లు ఇప్పటికే మ్యాచ్ ఫీజు చెల్లించారు. అయితే ఇప్పుడు ఈ ఐదుగురు కెప్టెన్లు మరోసారి ఇదే తప్పు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

రిషభ్ పంత్ కు పొంచి ఉన్న ముప్పు

పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య గురువారం (ఏప్రిల్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సమయానికి ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై చర్యలు తీసుకున్నారు. బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

లిస్టులో వీరు కూడా..

ముంబై ఇండియన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు బీసీసీఐ జరిమానా విధించింది. మరీ ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించింది. దీంతో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కొక్కరు రూ.12 లక్షలు అంటే రూ.24 లక్షలు రెండుసార్లు జరిమానాగా చెల్లించారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఐదు జట్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles