IPL 2024: 21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు.. మొదటి ప్లేస్‌లో ఎవరున్నారంటే?

హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్ లో మూడో విజయాన్ని అందుకుంది. గురువారం (ఏప్రిల్ 19) పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది

IPL 2024: 21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు.. మొదటి ప్లేస్‌లో ఎవరున్నారంటే?
Tilak Varma
Follow us

|

Updated on: Apr 19, 2024 | 7:59 PM

హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్ లో మూడో విజయాన్ని అందుకుంది. గురువారం (ఏప్రిల్ 19) పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, ముంబై టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 78 పరుగులు, తిలక్ వర్మ అజేయంగా 34 పరుగుల చేయడంతో 190 పరుగులు చేయగలిగింది. ముఖ్యంగా తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇలా చేయడం ద్వారా 21 ఏళ్ల వయసులో 50 సిక్సర్లు బాదిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. తిలక్ వర్మ కంటే ముందు రిషబ్ పంత్ 21 ఏళ్ల వయసులో 94 సిక్సర్లు కొట్టి ఈ రికార్డు జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం తిలక్ వర్మ 50 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ 21 ఏళ్ల వయసులో 48 సిక్సర్లు కొట్టాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో, తిలక్ 41.60 సగటుతో 208 పరుగులు చేశాడు, ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. తిలక్ వర్మ ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన తిలక్ 32 మ్యాచ్ ల్లో 4 హాఫ్ సెంచరీలతో సహా 39.5 సగటుతో 948 పరుగులు చేశాడు. భారత క్రికెట్ జట్టు తరఫున కూడా కొన్ని మ్యాచ్ లు ఆడాడు.

ఇవి కూడా చదవండి

అమ్మాయిలకు గ్లోవ్స్ ఇస్తోన్న తిలక్ వర్మ.. వీడియో ఇదిగో..

పంజాబ్ పై విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ముంబై ప్లేయర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి