Sachin Tendulkar: వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన బెంగాల్ టైగర్.. ఎందుకో తెలుసా?

Sachin Tendulkar Birthday: ఈరోజు అంటే ఏప్రిల్ 24న భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. ఆయనకు 51 ఏళ్లు నిండాయి. ఈ 51 సంవత్సరాలలో, అతను క్రికెట్ ఫీల్డ్‌లో చాలా కాలం గడిపాడు. అక్కడ ఈ క్రికెట్ దిగ్గజం పరుగులు, రికార్డులే కాదు.. చాలా మంది మంచి స్నేహితులను కూడా సంపాదించాడు. అలాంటి స్నేహం సౌరవ్ గంగూలీతో కూడా ఉంది. అయితే, సచిన్ చేసిన ఓ పనితో గంగూలీకి నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందంట.

Sachin Tendulkar: వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన బెంగాల్ టైగర్.. ఎందుకో తెలుసా?
Hbd Sachin
Follow us
Venkata Chari

|

Updated on: Apr 24, 2024 | 10:22 AM

HBD Sachin Tendulkar: భారత క్రికెట్ తన సుదీర్ఘ చరిత్రలో అనేక భాగస్వామ్యాలను చూసింది. మైదానంలో ఎన్నో అద్బుతమైన భాగస్వామ్యాలను చూసింది. అయితే, వాటిలో కొన్ని మాత్రమే మైదానం వెలుపల ఉన్నంత గొప్పగా ఉంటాయి. భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అలాంటి జోడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు భారత క్రికెట్ అభిమానులకు చాలా చిరస్మరణీయ క్షణాలను అందించడమే కాకుండా, ఒకరితో ఒకరు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్ 51వ పుట్టినరోజున, సౌరవ్ గంగూలీకి నిద్రలేని రాత్రులను అందించిన అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు 1990, 2000లలో టెండూల్కర్-గంగూలీ భాగస్వామ్యాన్ని చాలా దగ్గరగా చూశారు. వీరిద్దరూ కలిసి చాలా పరుగులు చేయడం, ఎన్నో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడంతోపాటు అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు దిగ్గజాలు కూడా పిచ్‌లో ఒకరికొకరు మద్దతు అందించుకున్నారు. అందుకే వన్డే క్రికెట్‌లో వారి మధ్య 26 సార్లు సెంచరీ భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యం టీమ్ ఇండియాలో చేరిన తర్వాత కాదు, చాలా సంవత్సరాల క్రితం మొదలైందన్నమాట. ఇద్దరూ పాఠశాల స్థాయి క్రికెట్ ఆడుతున్నప్పుటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది.

స్నేహం బెదిరింపుతో మొదలు..

సచిన్ పాఠశాల రోజుల నుంచి ఎంతో పాపులర్ అయ్యాడు. అతని ఫొటోలు వార్తాపత్రికలలో కనిపించడం ప్రారంభించాయి. అదే సమయంలో, సౌరవ్ గంగూలీ కూడా నెమ్మదిగా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాన్పూర్‌లో జరిగిన ఒక టోర్నమెంట్‌లో ఒకరితో ఒకరు మైదానంలో ఢీకొన్నారు. ఆ తర్వాత ఇండోర్‌లోని BCCI అండర్-15 క్యాంపులో వారి స్నేహం ప్రారంభమైనప్పుడు ఈ ప్రారంభ కాలంలోనే వారిద్దరి మొదటి సమావేశం జరిగింది. సచిన్ చిన్నతనంలో ఎంత చలాకిగా ఉండేవాడో తెలిసిందే. అతని బెదిరింపులకు గంగూలీ బాధితుడయ్యాడంట.

ఇవి కూడా చదవండి

గంగూలీకి నిద్ర లేని రోజులు..

గంగూలీకి నిద్రలేని రాత్రులు ఇచ్చేందుకు ముంబై క్రికెట్ జట్టు సహచరులు జతిన్ పరాంజపే, కేదార్ గాడ్‌బోలేతో కొన్ని చిలిపి పనులు చేశామని సచిన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఒకసారి శిబిరం సమయంలో గంగూలీ మధ్యాహ్నం తన గదిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో సచిన్, పరాంజపే, గాడ్బోలే‌లతో కలిసి గంగూలీ గదిని నీటితో నింపారు. అప్పుడు అకస్మాత్తుగా మేల్కొన్న గంగూలీ తన చుట్టూ నీరు ఉండడం చూసి, భయపడిపోయాడు. సామాన్లు నీటిలో తేలడంతో ఏం చేయాలో తోచలేదంటూ ఆనాటి సంగతులు గుర్తు చేశాడు.

24 ఏళ్ల అద్భుతమైన కెరీర్..

అయితే, ఈ తుంటరి పని సచిన్, అతని ఇతర సహచరులది అని గంగూలీకి తరువాత తెలిసింది. ఇక్కడి నుంచే మొదలైన వారి స్నేహం నేటికీ కొనసాగుతోంది. ఇది జరిగిన కొద్దిసేపటికే, సచిన్ కేవలం 16 సంవత్సరాల వయస్సులో భారతదేశం తరపున తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. సచిన్ 1989లో పాకిస్థాన్ టూర్‌లో కరాచీ టెస్ట్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అది సరిగ్గా 24 ఏళ్ల తర్వాత 2013లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముగిసింది. ఈ 24 ఏళ్లలో సచిన్ మూడు ఫార్మాట్లలో కలిపి 664 మ్యాచ్‌లు ఆడి 34357 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 100 సెంచరీలు ఆయన పేరు మీద ఉన్నాయి. 201 వికెట్లు కూడా తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉల్లికాడలు రుచి కోసం మాత్రమే కాదు.. వీటితో లెక్కలేనన్ని లాభాలు!
ఉల్లికాడలు రుచి కోసం మాత్రమే కాదు.. వీటితో లెక్కలేనన్ని లాభాలు!
తెలంగాణ టెట్‌ 2024 పూర్తి షెడ్యూల్‌ విడుదల.. 14 రోజుల్లో పరీక్షలు
తెలంగాణ టెట్‌ 2024 పూర్తి షెడ్యూల్‌ విడుదల.. 14 రోజుల్లో పరీక్షలు
స్టేషన్ మాస్టర్‌కు అతి విశిష్ట రైలు సేవా పురస్కార్.. ఎందుకంటే
స్టేషన్ మాస్టర్‌కు అతి విశిష్ట రైలు సేవా పురస్కార్.. ఎందుకంటే
దృశ్యం సినిమాను తలపించేలా సీన్..!
దృశ్యం సినిమాను తలపించేలా సీన్..!
సిద్ధు జొన్న‌లగ‌డ్డ జాక్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ సినిమా వాయిదా?
సిద్ధు జొన్న‌లగ‌డ్డ జాక్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ సినిమా వాయిదా?
అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు.?
అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు.?
బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్ నాతో చెప్పింది ఇదే..
బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్ నాతో చెప్పింది ఇదే..
తులసిని తాకడానికి, తులసీ దళాలు కోయడానికి నియమాలున్నాయని తెలుసా
తులసిని తాకడానికి, తులసీ దళాలు కోయడానికి నియమాలున్నాయని తెలుసా
డా బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో BEd ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
డా బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో BEd ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాల్సింది.. అనుకోకుండా స్టార్ హీరోయిన్
ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాల్సింది.. అనుకోకుండా స్టార్ హీరోయిన్