స్కై టూ అయ్యర్.. టీమిండియాలో ఎక్కువగా చదువుకున్న క్రికెటర్లు వీరే

TV9 Telugu

16 December 2024

అనిల్ కుంబ్లే క్రికెట్‌లో రికార్డులను బద్దలు కొట్టడమేకాదు.. చదువుల పరంగా మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని సంపాదించాడు.

అనిల్ కుంబ్లే

కేకేఆర్ డైనమిక్ ఆల్-రౌండర్ తన ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఉన్నత విద్యతో క్రికెట్‌ను ఎలా బ్యాలెన్స్ చేయాలో ఉదాహరణగా నిలిచాడు.

వెంకటేష్ అయ్యర్

మైదానంలో బౌలర్లను ఊచకోత కోసే సూర్యకుమార్ యాదవ్, బీకాం పట్టాను అందుకున్నాడు. 

సూర్యకుమార్ యాదవ్

మురళీ విజయ్ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశాడు. క్రికెట్ పిచ్‌పైనా ఎన్నో విజయాలను అందుకున్నాడు.

మురళీ విజయ్

స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఆర్ అశ్విన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో  బీటెక్ పూర్తి చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్

"ది వాల్"గా పేరున్న రాహుల్ ద్రవిడ్ కామర్స్ గ్రాడ్యుయేట్. ఆట పట్ల అతని క్రమశిక్షణా విధానం అతని అకడమిక్ మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాహుల్ ద్రవిడ్

జవగల్ శ్రీనాథ్, తన నిలకడకు ప్రసిద్ధి చెందిన ఫాస్ట్ బౌలర్.  ఇన్‌స్ట్రుమెంటల్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

జావగల్ శ్రీనాథ్

గంగూలీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కలకత్తా నుంచి మేనేజ్‌మెంట్ కోర్సును కలిగి ఉన్నాడు. ఇది అతని వ్యాపార చతురత, వ్యూహాత్మక ఆలోచనను ప్రదర్శిస్తుంది.

సౌరవ్ గంగూలీ