AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Ashwin: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మొనగాళ్లు.. అశ్విన్ ప్లేస్ ఎక్కడంటే?

Ashwin Retires From International Cricket: గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆల్ రౌండర్ ఆర్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్ తన కెరీర్‌లో పడగొట్టిన వికెట్లు ఎన్ని, ముఖ్యంగా టెస్టుల్లో టాప్ 10 లిస్టులో ఎక్కడున్నాడో ఓసారి చూద్దాం..

R Ashwin: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మొనగాళ్లు.. అశ్విన్ ప్లేస్ ఎక్కడంటే?
Ashwin Retires From International Cricket
Venkata Chari
|

Updated on: Dec 18, 2024 | 12:13 PM

Share

Ashwin Retires From International Cricket: గబ్బా టెస్ట్ ఫలితం తర్వాత అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ ఊహించని పరిణామంతో మాజీలు సైతం ఆశ్యర్యానికి గురవుతున్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులు జరిగాయి. మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు ఎంపికైన ఆశ్విన్‌కు కేవలం ఓకే మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ దక్కింది.

ఇక టెస్టుల విషయానికి వస్తే ఆర్ అశ్విన్ 537 టెస్టు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్టు పడగొట్టిన జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ ఆల్-టైమ్ టెస్ట్ వికెట్లు తీసిన జాబితాలో 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి
ర్యాంక్ పేరు మ్యాచ్‌లు ఇన్నింగ్స్ వికెట్లు
1 ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) 133 230 800
2 షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 145 273 708
3 జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్) 188 350 704
4 అనిల్ కుంబ్లే (ఇండియా) 132 236 619
5 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) 167 309 604
6 గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) 124 243 563
7 రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) 106 200 537
8 నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) 132 246 533
9 కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) 132 242 519
10 డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా) 93 171 439

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..