Ram Charan: అందుకే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు.. బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్ నాతో చెప్పింది ఇదే..
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఇటీవలే జరిగింది. అందరూ ఊహించినట్టే నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. గౌతమ్ ఈ సీజన్ లో రన్నరప్ గా నిలిచాడు. చాలా మంది గౌతమ్ విన్నర్ అవుతాడు అని అనుకున్నారు. కానీ నిఖిల్ విన్ అయ్యాడు. ఇక ఈ ఫైనలేకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. బిగ్ బాస్ స్టేజ్ పై గౌతమ్ తో చరణ్ ఏమన్నారంటే..
బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయ్యింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనే విమర్శలు ఉన్నాయి. ఇక అంతా ఊహించినట్టే బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అలాగే గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన దగ్గర నుంచి అనేక ట్విస్ట్ లు ఇచ్చారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవారు ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆతర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీలతో పాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను తిరిగి తీసుకొచ్చారు. ఆతర్వాత రెండు టీమ్స్ గా చేసి టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. కాగా బిగ్ బాస్ సీజన్ 8లో బెస్ట్ కంటెస్టెంట్ గా నిలిచాడు గౌతమ్ కృష్ణ. సీజన్ 7లో పాల్గొన్న గౌతమ్. సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!
మనోడు ఎంట్రీ నుంచి చివరి వరకు తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టాస్క్ ల్లో అద్భుతంగా ఆడాడు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లో తన 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు గౌతమ్. గొడవలు, వాదనలు, ఎన్ని వచ్చినా కూడా గౌతమ్ తన గేమ్ తెలివిగా ఆడాడు. బిగ్ బాస్ ఫైనల్స్ వరకు వచ్చాడు. చాలా మంది గౌతమ్ విన్ అవుతాడు అని అనుకున్నారు. కానీ గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ ఫినాలే రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సీజన్ 8 విన్నర్ కు కప్ అందించారు.
ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ తో రామ్ చరణ్ ఏం చెప్పారో తెలిపాడు. గౌతమ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ విన్నర్ అవ్వలేదు అని చిన్న నిరాశ వచ్చింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు నన్ను అభినందించారు అని తెలిపాడు. బిగ్ బాస్ విన్నర్ ను అనౌన్స్ చేసిన తర్వాత నేను స్టేజ్ పై నేను.. కొంచం దూరంగా జరిగాను. అప్పుడు రామ్ చరణ్ నా చెయ్యి పట్టుకొని. మా అమ్మ రెగ్యులర్ గా బిగ్ బాస్ చూస్తుంటారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్ అని మా అమ్మ చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు రన్నరప్ అయినా కూడా బాధపడొద్దు. ఇక్కడి వరకు వచ్చావు చాలా గ్రేట్. ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నావ్. నువ్వు చాలా సాధించాలని కోరుకుంటున్నా అని రామ్ చరణ్ అన్నారని గౌతమ్ తెలిపాడు. నిజంగా ఆయన గ్లోబల్ స్టార్ అని అప్పుడు అనిపించింది. విన్నర్ దగ్గరకు అందరూ వెళ్తారు. కానీ నేను లో ఫీల్ అవుతున్నా అని గమనించి రామ్ చరణ్ నా దగ్గరకు వచ్చారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు.. అయినా కూడా నాకు ఓ భరోసా ఇవ్వాలి వచ్చి నాతో మాట్లాడారు అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.