కాంబ్లీ అప్పులు తీర్చిన ఫ్రెండ్స్.. హోంలోన్ కూడా లేదంట?
TV9 Telugu
17 December 2024
'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు అనారోగ్యంతో పోరాడుతున్నారు.
52 ఏళ్ల కాంబ్లీ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి బాగా విషమించింది. నడవడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి కష్టకాలంలో వినోద్‌కు ఎలాంటి ఆదాయ వనరు కూడా లేదు.
అతను బీసీసీఐ నుంచి ప్రతి నెల పొందుతున్న పెన్షన్‌పై ఆధారపడి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఆయన చికిత్స ఖర్చులను ఎవరు భరిస్తున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఈ బ్యాడ్ టైమ్‌లో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కుటుంబం అతనితో ఉంది. కాంబ్లీ తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నాడు. అతనికి భార్య ఆండ్రియా హెవిట్, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఒకప్పుడు వినోద్ కాంబ్లీకి కోట్లాది ఆస్తులతో విలాసవంతమైన జీవితం గడిపాడు. అయితే ఇప్పుడు కాంబ్లీ దగ్గర చికిత్సకు కూడా డబ్బులు లేవు. అతని స్నేహితులు అతని చికిత్స ఖర్చులను భరిస్తున్నారు.
మీడియా నివేదికల ప్రకారం, కాంబ్లీకి సహాయం చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. అదే సమయంలో బీసీసీఐ వస్తోన్న పెన్షన్ కూడా ఉంది.
కాంబ్లీ 2010లో తాను నివసిస్తున్న ఇంటికి మారాడు. అప్పుడు ఈ ఇంటి ధర రెండు కోట్ల రూపాయలు. కాగా నేడు దీని ధర రూ.8 కోట్లు. వినోద్ కాంబ్లీకి గృహ రుణం కూడా ఉందని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి.
డీఎన్‌ఎస్ బ్యాంక్ నుంచి రూ.55 లక్షల ఇంటి రుణం తీసుకున్నాడు. అయితే, ఇప్పుడు కాంబ్లీకి ఎలాంటి హోమ్ లోన్ లేదని వార్తలు వస్తున్నాయి.